'అద్భుతమైన బంతి వేసినప్పుడు కోహ్లీ చిరునవ్వు నవ్వేవాడు'

హైదరాబాద్: ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో తనకూ కోహ్లీకి మధ్య జరిగిన పోరాటం ఎంతో నచ్చిందని ఇంగ్లాండ్ ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ అన్నాడు. తొలి టెస్టులో వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. 2014 పర్యటనలో కోహ్లీని ఎక్కువ సార్లు పెవిలియన్‌కు చేర్చిన ఆండర్సన్ తొలి టెస్టులో కూడా ఔట్ చేసేందుక తెగ ప్రయత్నించాడు.

కోహ్లీని ఔట్ చేయలేకపోయిన ఆండర్సన్
అయితే కోహ్లీని మాత్రం పెవిలియన్‌కు పంపలేకపోయాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు లార్డ్స్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ది సన్ అనే పత్రికకు జేమ్స్ ఆండర్సన్ ఇంటర్యూలో ఇచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లీతో క్రికెట్ వైరం అత్యున్నత స్థాయిలో ఉంటుందని ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు.

కోహ్లీకి అద్భుతంగా బౌలింగ్ చేశా
"ఎడ్జ్‌బాస్టన్‌లో నాకూ కోహ్లీకి మధ్య జరిగిన పోరాటం ఎంతో నచ్చింది. అదొక గొప్ప పోరాటం. కోహ్లీకి అద్భుతంగా బౌలింగ్ చేశా. నా ప్రణాళికలు బాగా పనిచేశాయి. అతడిని పెవిలియన్ పంపించేవాడినే. క్యాచ్ జారవిడవడంతో ఆ అవకాశం పోయింది. దాంతో విరాట్ తొలి ఇన్నింగ్స్‌లో 149, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు సాధించాడు" అని అన్నాడు.

కోహ్లీ కన్నా మంచి ఫామ్ చక్కటి ఫామ్ కనబర్చాలి
దీంతో రెండో టెస్టులో కోహ్లీ కన్నా మంచి ఫామ్ కొనసాగించాలని కోరుకుంటున్నానని ఆండర్సన్ తెలిపాడు. ఇంకా విభిన్నంగా ప్రయోగాలు చేసేందుకు కోహ్లీ బ్యాటింగ్ వీడియోలు పరిశీలించానని అండర్సన్ తెలిపాడు. తొలి టెస్టులో టెయిలెండర్లతో కలిసి ఆడుతున్న విరాట్ కోహ్లీ తమ బౌలర్లు కఠిన పరీక్ష పెట్టాడని పేర్కొన్నాడు.

చిరునవ్వు నవ్వితే కోహ్లీ కూడా నవ్వేవాడు
ఈ క్రమంలో మిగతా బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపామని పేర్కొన్నాడు. తొలి టెస్టులో తానూ, విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రీడాస్ఫూర్తితో ఆడామని పేర్కొన్నాడు. తాను అద్భుతంగా బంతులు వేసినప్పుడు చిరునవ్వు నవ్వితే కోహ్లీ సైతం ప్రతిగా చిరునవ్వు నవ్వేవాడని ఆండర్సన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications