లార్డ్స్‌లో కోహ్లీని ఔట్ చేసేది నేనే: ఆండర్సన్ ధీమా

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓడించేందుకు మ్యాచ్ ఆరంభానికి ఇంకా రోజుల వ్యవధి ఉండగానే ప్రణాళికలు రచించేస్తున్నారు ఇంగ్లాండ్ బౌలర్లు. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా గురువారం నుంచి జరగనున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీని తాను ఔట్ చేస్తానని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్-ఇండియా తొలి టెస్టు అనంతరం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రస్తుతం నెం. 1 బౌలర్‌గా కొనసాగుతున్న అండర్సన్.. గత శనివారం ముగిసిన బర్మింగ్‌హామ్ టెస్టులో నెం. 1 బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను తీయలేకపోయాడు.

2014 లో దారుణంగా విఫలమైన కోహ్లి.. :
2014 పర్యటనలో అండర్సన్ బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన కోహ్లి.. తొలి టెస్టులో ఈ ఫాస్ట్ బౌలర్‌ని జాగ్రత్తగా ఎదుర్కొన్నాడు. మొదటి టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి మొత్తం 149 పరుగులు చేయగా.. అందులో అండర్సన్ బౌలింగ్‌లో రాబట్టిన పరుగులు 17 మాత్రమే. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ మేటి బౌలర్ బౌలింగ్‌లో కోహ్లి ఎలా ఆచితూచి బ్యాటింగ్ చేశాడోనని.. అయితే.. కెప్టెన్ పోరాడినా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి భారత్ జట్టు 31 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

మొదటి టెస్టులో కోహ్లి, అండర్సన్‌ల మధ్య తీవ్రమైన:
వారి ఎత్తుగడలకు ధీటుగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 200 (149, 51) పరుగులు చేశాడు. ఇలా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. మొదటి టెస్టులో అందరూ ఊహించినట్లుగా కోహ్లి, అండర్సన్‌ల మధ్య అంత తీవ్రమైన పోటీని చూడలేదు. అయితే లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్‌లలో వీరి మధ్య టఫ్ ఫైట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని నేను ఆస్వాదిస్తా.
ఆధిపత్యం గురించి అండర్సన్ మాట్లాడుతూ ‘విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని నేను బాగా ఆస్వాదిస్తా. తొలి టెస్టులోనే అతడ్ని ఔట్ చేసే అవకాశం నాకు వచ్చింది. కానీ.. స్లిప్‌లో రెండు సార్లు అతడి క్యాచ్‌ని ఫీల్డర్లు నేలపాలు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో అతను 149 పరుగులు చేసినా.. నా బౌలింగ్‌లో కేవలం 17 పరుగులే చేయడం కొంచెం ఉపశమనం. ఇప్పుడు అతను నెం.1 ర్యాంక్ బ్యాట్స్‌మెన్.. నేనేమో నెం.1 బౌలర్.

లార్డ్స్‌లో మ్యాచ్‌లో టఫ్ ఫైట్ ఉండబోతోంది.
కాబట్టి.. లార్డ్స్‌లో జరిగే మ్యాచ్‌లో టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఫామ్‌లో ఉండటంతో అతను నాపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తాడు. నేనూ దానికి తగ్గట్లుగానే పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తా' అని అండర్సన్ వెల్లడించాడు. 2014 పర్యటనలో ఐదు టెస్టులు (10 ఇన్నింగ్స్‌లు) ఆడిన కోహ్లి నాలుగు సార్లు అండర్సన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications