Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఆట మొదలైన కాసేపటికే.. ఐదు వికెట్లు కోల్పోయిన భారత్‌!!

India vs England: Jack Leach, Moeen Ali strikes Team India lose 5 wickets

చెన్నై: చెన్నై: రెండో టెస్టులో చెపాక్ పిచ్‌ స్పిన్నర్లకు పూర్తిగా సహకరిస్తుండడంతో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగుతున్నారు. జాక్ లీచ్, మొయిన్ అలీ దాటికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన ఐదు వికెట్లు‌ కోల్పోయింది. మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీసేన గంటలోనే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో డ్రింక్స్‌ విరామ సమయానికి 97/5తో నిలిచింది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (18), ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ ‌(2) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 35 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీసేన ఆధిక్యం 297 పరుగులకు చేరింది.

మూడో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 54/1తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొయిన్ అలీ‌‌ బౌలింగ్‌లో చేటేశ్వర్ పుజారా (7) అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన అలీ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి ఆడడంలో విఫలమయిన పుజారా వెనుదిరిగాడు. ఇక జాక్ లీచ్ బౌలింగ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (26) స్టంప్ ఔట్ అయ్యాడు. మరికొద్ది సేపటికే లీచ్‌‌ బౌలింగ్‌లోనే రిషబ్ పంత్ (8) కూడా స్టంప్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.

వైస్ కెప్టెన్ అజింక్య రహానే (10) రెండు బౌండరీలు బాది మంచి ఊపులో కనిపించాడు. అయితే మొయిన్ అలీ‌‌ బౌలింగ్‌లో ఓలి పోప్‌కి చిక్కి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆపై ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ అండతో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డును ముందు నడిపిస్తున్నాడు. కోహ్లీ (18), అక్షర్‌ ‌(2) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 35 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీసేన ఆధిక్యం 297 పరుగులకు చేరింది.

చెపాక్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'ఇంట్రస్టింట్' అంటూ ఆ ట్వీట్‌కు ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఆదివారం చెన్నైలోని కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విమానంలో వెళ్లిన మోదీ.. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో చెన్నై చిదంబరం స్టేడియంపై నుంచి వెళ్లారు. ఈ క్రమంలోనే ఏరియల్‌ వ్యూ నుంచి తీసిన స్టేడియం ఫోటోను ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. 'చెన్నై స్టేడియంలో జరుగుతున్న రసవత్తరమైన మ్యాచ్‌ను ఆకాశం నుంచి చూశాను' అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Story first published: Monday, February 15, 2021, 11:04 [IST]
Other articles published on Feb 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+