India vs England: రెండో భారత బ్యాట్స్‌మన్‌గా ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు! నాలుగో క్రికెటర్‌గా కూడా!

అహ్మదాబాద్: యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్.. మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలో తన ముద్ర బలంగా వేయాలనే ఉద్దేశంతో బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. తానాడిన తొలి బంతినే బౌండరీకి పంపిన కిషన్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఆడేది తొలి మ్యాచ్ అయినా.. చూడముచ్చటైన షాట్లతో బౌండరీలు, సిక్సులు బాదాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి వేగంగా పరుగులు జతచేశాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది అంతర్జాతీయ క్రికెట్లో తొలి అర్ధ సెంచరీ (56; 32 బంతుల్లో 5×4, 4×6) అందుకున్నాడు. కిషన్ బ్యాటింగ్‌కు క్రీజులో ఉన్న కోహ్లీ కూడా ఫిదా అయ్యాడు.

అరంగేట్రంలోనే అర్ధ సెంచరీ:
రెండో టీ20లో 22 ఏళ్ల ఇషాన్ కిషాన్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అరంగేట్రం టీ20 మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా ఇషాన్ రికార్డుల్లోకి ఎక్కాడు. అరంగేట్రంలో అర్ధ సెంచరీ సాధించిన రికార్డు టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే పేరుపై ఉంది. 2011లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లండ్‌పై రహానే 61 పరుగులు చేశాడు. రహానే 39 బంతుల్లో ఎనిమిది బౌండరీలతో 61 పరుగులు చేశాడు. రెండో టీ20లో 28 బంతుల్లో ఫిఫ్టీ బాదిన కిషన్.. అరంగేట్రంలో అర్ధ సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

అరంగేట్రంలోనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్':
అద్భుత ఆటతో అదరగొట్టిన ఇషాన్ కిషాన్.. మరో రికార్డు కూడా నెలకొల్పాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా ఇషాన్ నిలిచాడు. గతంలో పేసర్ మోహిత్ శర్మ (2013లో జింబాబ్వేపై), ఓపెనర్ పృథ్వీ షా (2018లో వెస్టిండీస్‌పై), పేస్ బౌలర్ నవదీప్ సైనీ (2019లో వెస్టిండీస్‌పై) అరంగేట్రం మ్యాచ్‌లోనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడాడు.

వరుసగా రెండు సిక్సర్లు బాది:
మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌నే బౌండరీకి తరలించిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత టామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో 6, 4, 4 బాదాడు. అనంతరం వచ్చిన బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ బాదేశాడు. ఇక స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ని టార్గెట్‌గా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. ఇషాన్‌కు 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జీవనదానం లభించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న అతను రషీద్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది అంతర్జాతీయ క్రికెట్లో తొలి అర్ధ సెంచరీ అందుకున్నాడు. కానీ అదే ఓవర్లో రివర్స్ స్వీప్ ఆడేందుకు విఫలయత్నం చేసి ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

ఏడు వికెట్ల తేడాతో విజయం:
ఆదివారం మొతేరాలో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. రాయ్ (46; 35 బంతుల్లో 4×4, 2×6) ఫామ్ కొనసాగించాడు. భారత బౌలర్లలో సుందర్ (2/29), ఠాకూర్ (2/29) సత్తాచాటారు. ఛేదనలో విరాట్ కోహ్లీ (73 నాటౌట్; 49 బంతుల్లో 5×4, 3×6), ఇషాన్ (56) అర్ధ శతకాలతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. 3 వికెట్లు కోల్పోయిన భారత్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మూడో టీ20 మంగళవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications