For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఇంగ్లాండ్‌కు షాక్..!!

England vs India 2018: Alex Hales ruled out of first ODI
 India vs England: Injured Alex Hales ruled out of first ODI

హైదరాబాద్: భారత్‌తో తొలి వన్డే ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అలెక్స్‌ హేల్స్‌ గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మరికొద్దిసేపట్లో తొలి వన్డే ప్రారంభంకానుంది. పర్యాటక భారత జట్టు ఇప్పటికే ఇంగ్లిష్‌ గడ్డపై టీ20 సిరీస్‌ గెలుచుకొంది. అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతోంది.

మరో పక్క సొంతగడ్డపై టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌ ఎలాగైనా వన్డే సిరీస్‌ను దక్కించుకోవాలని కసిగా ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో హేల్స్‌ పాల్గొనలేదు. గాయం కారణంగా అతడు ప్రాక్టీస్‌కు హాజరుకాలేదని, భారత్‌తో జరిగే తొలి వన్డేకు దూరం కానున్నాడని జట్టు మేనేజ్‌మెంట్‌ తెలిపింది. దీంతో ఇంగ్లాండ్‌ జట్టుకు ఇది గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఎందుకంటే గురువారం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య తొలి వన్డే జరిగే ట్రెంట్‌ బ్రిడ్జ్‌ మైదానంలోనే హేల్స్‌ గత నెల ఆస్ట్రేలియాపై 147 పరుగులు సాధించాడు.

అచ్చొచ్చిన మైదానంలో జరిగే మ్యాచ్‌కు హేల్స్‌ దూరం కావడం ఇంగ్లాండ్‌ను కలవరపెట్టే విషయమే. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌తో ఆ జట్టు బలంగా ఉంది. హేల్స్‌ స్థానంలో డేవిడ్‌ మలాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రతి మ్యాచ్‌కు ముందు గాయం తీవ్రతను పరీక్షించిన తర్వాతే హేల్స్‌ను జట్టులోకి తీసుకోవాలో లేదో నిర్ణయం తీసుకుంటామని సెలక్టర్లు తెలిపారు.

మరి కొద్ది సమయంలో మొదలుకాబోతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా కూడా మార్పులు చేర్పులు చేపట్టింది. ఫామ్ లేమితో బాధపడుతున్న ధావన్ పరిస్థితి అయోమయంగా మారడంతో.. సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్న కేఎల్ రాహుల్‌ను మూడో స్థానంలో పంపాలని యోచిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటి వరకూ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న కోహ్లీ స్థానం మార్చుకుని 4లో రావాలసిందే. ఇక బౌలింగ్ విషయానికొస్తే మూడో టీ20లోనే కుల్దీప్‌ను దూరంగా ఉంచడంతో ఈ మ్యాచ్‌లో కూడా అతనికి తుది జట్టులో స్థానం దక్కే దాఖలాల్లేవ్..!!

Story first published: Tuesday, July 17, 2018, 16:28 [IST]
Other articles published on Jul 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+