India vs England: భారత జట్టుకి జస్ప్రీత్ బుమ్రా దూరం.. పెళ్లి కోస‌మేనా?

Ind vs Eng 2021 : Jasprit Bumrah To Tie The Knot In The Middle Of This Month | Oneindia Telugu

అహ్మదాబాద్: గురువారం నుంచి అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రిగే నాలుగో టెస్ట్‌తో పాటు ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూర‌మైన విష‌యం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో బుమ్రా జట్టుకు దూరం కానున్నాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ నెలాఖర్లో మొదలయ్యే వన్డే సిరీస్‌కు కూడా బుమ్రా అందుబాటులో ఉండడని వార్తలొస్తున్నాయి. మరి బుమ్రాకు ఇన్ని రోజుల విశ్రాంతి ఎందుకనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. వర్క్‌లోడ్ కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడని అంతా ఊహించారు. కానీ అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

పెళ్లి కోసమే బుమ్రా సెలవు

పెళ్లి కోసమే బుమ్రా సెలవు

నాలుగో టెస్టు సహా మార్చి 12 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభంకాబోతున్న ఐదు టీ20ల సిరీస్‌కి కూడా జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాంతో బుమ్రా ఇన్నిరోజులు టీమిండియాకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? అని పలు మీడియా సంస్థలు ఆరాతీయగా.. అతని పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది. బుమ్రా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడట. అందుకే ఈ సెలవులని అంటున్నారు. అమ్మాయి ఎవరు, పెళ్లెప్పుడు అన్న వివరాలు తెలియరాలేదు. కానీ బుమ్రా పెళ్లాడబోతున్న మాట మాత్రం నిజమని సమాచారం.

ఎలాంటి అధికారిక ప్రకటన లేదు:

ఎలాంటి అధికారిక ప్రకటన లేదు:

'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు బీసీసీఐకి తెలిపాడు. వివాహ ఏర్పాట్ల కోసం తగిన సమయం కావాలి కాబట్టే జట్టుకు దూరమయ్యాడు' అని బీసీసీఐ వర్గాలు ఓ జాతీయ మీడియాతో తెలిపాయి. అయితే బుమ్రా పెళ్లి విషయమై ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు. బుమ్రా లేదా బీసీసీఐ చెపితే గాని అసలు విషయం వెలుగులోకి రాదు. 27 ఏళ్ల బుమ్రా భారత్ తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఐపీఎల్ ద్వారా 2016లో భారత జట్టులోకి వచ్చిన బుమ్రా.. అనతికాలంలోనే స్టార్ పేసర్‌గా ఎదిగాడు.

బిజీ షెడ్యూల్:

బిజీ షెడ్యూల్:

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్ 2021 ఉంది. ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కీలక బౌలర్. ఆ తర్వాత జూన్‌లోనే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఆపై అక్టోబరు- నవంబరులో టీ20 ప్రపంచకప్‌ ఉంది. బిజీ షెడ్యూల్ మధ్య ఖాళీ సమయమే లేదు. అందుకే పెళ్లికి ఇదే తగిన సమయం అని బుమ్రా భావించినట్లు సమాచారం తెలుస్తోంది.

ఇటీవల భారత్‌లో తొలి టెస్ట్:

ఇటీవల భారత్‌లో తొలి టెస్ట్:

2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా.. ఇటీవల భారత్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ (చెన్నైలో జరిగిన తొలి టెస్టుతో) ఆడాడు. అప్పటివరకు బుమ్రా భారత్ తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడడం విశేషం. భారత్‌లో తొలి టెస్టు ఆడడానికి బుమ్రాకు మూడేళ్లు పట్టింది. సొంత‌గ‌డ్డ‌పై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్య‌ధిక టెస్టులు ఆడిన ప్లేయ‌ర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు వెస్టిండీస్ ప్లేయ‌ర్ డారెన్ గంగా కూడా స్వ‌దేశం బ‌య‌ట 17 టెస్టులు ఆడాడు.

India vs England: నాలుగో టెస్టు ముందు.. కోహ్లీని ఊరిస్తున్న పలు రికార్డులు ఇవే!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, March 3, 2021, 11:07 [IST]
Other articles published on Mar 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X