విదేశాల్లో జట్లు తడబడుతుంటే.. భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది! కారణం అదే: ఛాపెల్‌

సిడ్నీ: విదేశాల్లో జట్లు తడబడుతున్న తరుణంలో భారత్‌ మాత్రం అన్ని టీంలపై ఆధిపత్యం చెలాయిస్తోందని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ అన్నారు. ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించే దారిలో కోహ్లీసేన సాగుతోందన్నారు. ఆస్ట్రేలియాలో భారత్ విజయాలను చూస్తుంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాలు సాధించగల ఆత్మవిశ్వాసం ఆటగాళ్లలో కనిపిస్తోందని ఛాపెల్‌ పేర్కొన్నారు. ఇంగ్లండ్ పర్యటనలో మూడు ఫార్మాట్లలో భారత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆసీస్ పర్యటనలో కూడా భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

ఆటగాళ్లు పోటీపడుతున్నారు

ఆటగాళ్లు పోటీపడుతున్నారు

తాజాగా ఇయాన్‌ ఛాపెల్‌ మాట్లాడుతూ... 'ఇటీవల ఆస్ట్రేలియాలో భారత్ విజయాలను చూస్తుంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాలు సాధించగల ఆత్మవిశ్వాసం ఆటగాళ్లలో కనిపిస్తోంది. విదేశాల్లో జట్లు తడబడుతోంటే భారత్‌ మాత్రం అన్ని టీంలపై ఆధిపత్యం చెలాయిస్తోంది. కోహ్లీసేన వచ్చిందంటే దూరం నుంచి పరుగెత్తి బంతులేస్తే సరిపోదని ఆతిథ్య జట్లు గమనిస్తున్నాయి. ఒకప్పటి వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా తరహాలో ఇప్పుడు భారత జట్టులో ప్రతిభావంతులు ఉన్నారు. తుది జట్టులో చోటుకే ఇబ్బంది ఎదురవుతోంది. ఆటగాళ్లు పోటీపడుతున్నారు' అని అన్నారు.

భారత్ ఆధిపత్యం సాగుతోంది

భారత్ ఆధిపత్యం సాగుతోంది

'విజయాల వెనుక కొన్ని ఓటములు ఎదురవుతున్నా.. ప్రపంచ క్రికెట్లో భారత్ ఆధిపత్యం సాగుతోంది. భారత దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థ అద్భుతంగా ఉంది. కోహ్లీసేన విజయవంతం అయ్యేందుకు కారణం అదే. శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌, టీ నటరాజన్‌, అక్షర్‌ పటేల్‌ వంటి ఆటగాళ్లే ఇందుకు ఉదాహరణ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది. ప్రతి ఏడాది కుర్రాళ్లు సత్తాచాటుతున్నారు. జాతీయ జట్టులో చోటు సంపాదిస్తున్నారు' అని ఇయాన్‌ ఛాపెల్ పేర్కొన్నారు.

గంగూలీ దారినే ధోనీ అనుసరించాడు

గంగూలీ దారినే ధోనీ అనుసరించాడు

'శార్దూల్‌ ఠాకూర్‌ రెండో మ్యాచులోనే అదరగొట్టాడు. రిషభ్‌ పంత్‌ టీ20ల్లోకి రాకముందే అంతర్జాతీయ విజేత. అందరు ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. గిల్‌, సిరాజ్‌ చోటు దక్కించుకోగలరు. ఇంగ్లండ్‌పై ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కృనాల్‌ పాండ్యా అరంగేట్రంలోనే అదరగొట్టారు. రాంచీ నుంచి వచ్చిన ఎంఎస్‌ ధోనీ విజయవంతం అవ్వడంతో మారుమూల గ్రామాల్లోని యువకులకు తమపై విశ్వాసం పెరిగింది. ప్రత్యర్థి ఆటగాళ్లతో తాము సమానం అన్న విశ్వాసాన్ని సౌరవ్ గంగూలీ సారథ్యం క్రికెటర్లలో నింపింది. మహీ మార్గనిర్దేశంలో అది మరింత పెరిగింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో అత్యున్నత ప్రేరణగా మారింది' అని ఇయాన్‌ ఛాపెల్‌ చెప్పుకొచ్చారు.

‌విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్..గాల్లో డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో పట్టాడు!నేనే పట్టానా అంటూ ఆశ్చర్యం(వీడియో)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, March 29, 2021, 12:31 [IST]
Other articles published on Mar 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X