
కేఎల్ రాహుల్
కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌లో భారీ స్కోర్లు చేయడంతో విఫలమవుతున్నాడు. కాన్పూర్‌లో జరిగిన టీ20లో తొలుత రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రాహుల్ ఆ తర్వాత భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

విరాట్ కోహ్లీ
పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కోహ్లీ ఆడుతున్న తొలి టీ20 ఇది. రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరిస్ కు దూరం కావడంతో తొలి టీ20లో కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండో వన్డేలో కోహ్లీ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సురేశ్ రైనా
తొలి టీ20లో సురేశ్ రైనా ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. టీ20 స్పెషలిస్ట్ మాదిరి ఆడి 34 పరుగులు చేశాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రైనా చాలా కాలం తర్వాత టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో రెండో టీ20లో రైనా కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

యువరాజ్ సింగ్
మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ వన్డే సిరిస్‌లో తన కెరీర్‌లోనే అత్యధిక స్కోరుని నమోదు చేశాడు. అయితే తొలి టీ20లో అభిమానులను నిరాశపరిచాడు.

మహేంద్ర సింగ్ ధోని
తొలి టీ20 మాదిరే రెండో టీ20లో కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. తొలి టీ20లో ధోని టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తున్నా, ధోని మాత్రం నిలకడగా ఆడాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని కేవలం బ్యాటింగ్ పైనే తన దృష్టిని సారించాడు.

రిషబ్ పంత్
టీ20 జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు ఇప్పటివరకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. అయితే నాగ్ పూర్ వన్డేలో ఇతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అండర్ -19 వరల్డ్ కప్‌తో రిషబ్ పంత్ వెలుగులోకి వచ్చాడు.

హార్ధిక్ పాండ్యా
బరోడాకు చెందిన ఈ యువ ఆల్ రౌండర్ వన్డే సిరిస్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. దీంతో కాన్పూర్‌లో ఆదివారం జరగనున్న రెండో టీ20లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

అమిత్ మిశ్రా
టీమిండియా టాప్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇవ్వడంతో జట్టులో చోటు దక్కించుకున్న అమిత్ మిశ్రా రెండో టీ20లో ఆడే అవకాశం ఉంది. అమిత్ మిశ్రాకు తొలి టీ20లో ఆడే అవకాశం రాలేదు. అయితే రెండో టీ20లో ఆడే తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

యుజువేంద్ర చాహల్
హర్యానాకు చెందిన ఈ లెగ్ స్పిన్నర్ కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో అద్భుతంగా రాణించాడు. కెప్టెన్ కోహ్లీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తొలి టీ20లో రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో రెండో టీ20 ఆడే తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది.

జస్‌ప్రీత్ బుమ్రా
భారత టీ20 స్పెషలిస్ట్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను పేర్కొనవచ్చు. తన అద్భుతమైన యార్కర్లతో ప్రత్యర్ధి జట్టును హడలెత్తించే సత్తా ఉంది. తొలి టీ20లో అద్భుతమైన ప్రదర్శనను బుమ్రా కనబర్చాడు. కాన్పూర్‌లో జరిగిన తొలి టీ20లో 17వ ఓవర్ బౌలింగ్ చేసిన బుమ్రా ఐదో బంతికి జో రూట్‌ను బౌల్డ్ చేశాడు. దాంతో, టీమిండియా ఆటగాళ్లంతా బుమ్రాను అభినందించారు. మ్యాచ్ టర్న్ అయిందని అంతా భావించారు. అయితే, అంపైర్ దానిని రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ దానిని తరచి చూసి, నోబాల్‌గా ప్రకటించారు. దీంతో అవుట్ సంగతటుంచి, ఫ్రీ హిట్ వచ్చింది. దీంతో తరువాత బంతిని యార్కర్‌గా సంధించిన బుమ్రా మళ్లీ రూట్‌ను బౌల్డ్ చేశాడు. ఇలా వరుస రెండు బంతుల్లో రెండు సార్లు అవుట్ చేసినా రూట్ అవుట్ కాకపోవడంతో బుమ్రా నిరాశపడ్డాడు.

ఆశిష్ నెహ్రా
కాన్సూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆశిష్ నెహ్రా మంచి ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ నాగ్ పూర్ వన్డేలో జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో నెహ్రా అద్భుతమైన బౌలింగ్ చేస్తాడు.


Click it and Unblock the Notifications











