ఇంగ్లాండ్ పర్యటన: పాండ్యా 'ట్రావెల్ డే' పిక్చర్: ట్రోల్ చేసిన నెటిజన్లు


లండన్: టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాపై క్రికెట్ అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తు్ననారు. ఫ్యాషన్‌పై కాకుండా మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. బ్లాక్ కలర్ డ్రెస్, గాగుల్స్‌తో పాండ్యా ఎంతో ఎంతో స్టైల్‌గా కనిపించాడు. పాండ్యా పోస్టు చేసిన ఈ ఫోటో అభిమానుల విమర్శలకు కారణమైంది.

ఈ ఫొటోను చూసిన ఓ నెటిజన్ ఫ్యాషన్‌పై కాదు మ్యాచ్‌పై దృష్టి పెట్టు అని కామెంట్ చేయగా, మరొక నెటిజన్ ఇంగ్లాండ్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నావుగా అంటూ ట్రోల్ చేశాడు. మరొక అభిమాని లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నావో చెప్పు' అంటూ కామెంట్ పెట్టాడు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టులో కోహ్లీసేన గెలిస్తేనే టెస్టు సిరిస్ బరిలో నిలుస్తుంది. లేదంటే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మరో రెండు టెస్టులు మిగిలుండగానే ఇంగ్లాండ్ సొంతం చేసుకుంటుంది.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన కోహ్లీసేన, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలి రెండు టెస్టుల్లోనూ పాండ్యా ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications