For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ పాండ్యా ఆటగాడే అయిండొచ్చు.. కానీ స్టోక్స్‌యే బెస్ట్

 India vs England: Hardik Pandya Has Potential But Ben Stokes Is The Best All-Rounder, Says Shaun Pollock

హైదరాబాద్: భారత జట్టులో దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అంతటి వాడంటూ ప్రశంసలు అందుకున్న హార్దిక్ పాండ్యా మీద నిందలు వేస్తున్నాడు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ షాన్ పొలాక్. భారత జట్టులో బౌలింగ్.. బ్యాటింగ్ రెండింటిలోనూ అద్బుతంగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యాపై విమర్శలకు దిగాడు. 'పాండ్యా అద్భుతంగా ఆడగలిగే ఆటగాడే అయిండొచ్చు. కానీ, అతనికి క్రమశిక్షణ లేదు. టీ20 టోర్నమెంట్లలో క్రికెటర్లకు బ్యాటింగ్.. బౌలింగ్‌లోనూ రాణించేందుకు చక్కటి అవకాశం ఉంటుంది.

దీనిని చాలా వరకూ సద్వినియోగం చేసుకుంటారు. ఇటీవల హార్దిక్ పాండ్యా ఆడిన ప్రతి టీ20లోనూ బాగానే రాణించాడు' 'కానీ, తనకు ఆట పట్ల శ్రద్ధ, క్రమశిక్షణ లేవు. అతనికంటే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఉత్తమం. ఆల్ రౌండర్లందరిలో అతనే బెస్ట్.' అని చెప్పుకొచ్చాడు. 'హార్దిక్ ముందు బ్యాటింగ్.. బౌలింగ్‌లలో ఏదో ఒకదానిలో కుదురుకోవాలి. బహుశా విరాట్ కోహ్లీని మెప్పించడంతో అతనికి జట్టులో సులువుగా జట్టు దొరుకుతుందనుకుంటా. వికెట్లు తీస్తున్నాడు.. పరుగులు చేస్తున్నాడని... కానీ కొద్ది కాలానికి అతను రాణించలేడు' అని అభిప్రాయపడ్డాడు.

'ఒకవేళ అతను బ్యాటింగ్.. బౌలింగ్ నిజంగా చేయగలిగితే ఈపాటికే ఇండియా బెస్ట్ ఆల్ రౌండర్ అయి ఉండాల్సింది. కానీ అలా కాలేదే. నాకు తెలిసి అతను బ్యాటింగ్.. బౌలింగ్ లలో ఏదో ఒకటి ఎంచుకుంటేనే మంచి భవిష్యత్ పొందగలడు. అదే స్టోక్స్ విషయానికొస్తే ఆల్ రౌండర్‌గా 2500 పరుగులు చేసి 100వికెట్లను తీశాడు.' అని చెప్పాడు.

పొలాక్ ఇంతలా చెప్తున్న స్టోక్స్ కోర్డు తీర్పు కోసం.. కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. బ్రిస్టల్‌ నైట్‌ క్లబ్‌లో ఇద్దరు వ్యక్తులపై దాడి కేసులో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. బాధితుల్లో ఒకరైన ర్యాన్‌ హలె గురువారం కోర్టులో తన వాదనను వినిపిస్తూ.. 'స్టోక్స్‌ నన్ను చంపేసేవాడే' అని పేర్కొన్నాడు.

'అతను నాపై దాడిని ఎందుకు ఆపలేదో అర్థం కాలేదు. నా ప్రాణాలు తీసేలా కనిపించాడు. ఏం తప్పు చేయకున్నా కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొవడంతో షాక్‌కు గురయ్యా. ఆ రోజు నేను అలీతో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నా. స్టోక్స్‌ వచ్చి తన చేతితో నన్ను చెప్పరాని చోట తాకాడు. నేను మాజీ సైనికుణ్ని. అలాంటి చర్యను నేను భరించలేను. ఆ తర్వాత అతను నన్ను గిల్లి 'నాతో పాటు వస్తావా' అని అడిగాడు. స్వలింగ సంపర్కులైన నా ఇద్దరు స్నేహితులపై దాడికి ప్రయత్నించాడు. ఆపడానికి వెళ్తే నన్నూ తీవ్రంగా గాయపర్చాడు' అని హలె తెలిపాడు.

Story first published: Friday, August 10, 2018, 17:49 [IST]
Other articles published on Aug 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+