Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: శుభవార్త.. తొలి టీ20లో ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి!!

India vs England: Gujarat Cricket Association allow 50 per cent crowd for T20I series

అహ్మదాబాద్: సొంతగడ్డపై టీ20 నంబర్‌వన్‌ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సమరానికి భారత్‌ సై అంటోంది. మరికొద్ది గంటల్లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొతేరా మైదానంలో తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టీ20 మ్యాచ్‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించిన‌ట్లు గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ (జీసీఏ) వెల్ల‌డించింది. టీ20 సిరీస్ మొత్తానికి న‌రేంద్ర మోదీ స్టేడియంలో 50 శాతం మంది ప్రేక్ష‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొంది.

దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న‌ కరోనా వైరస్ కేసుల‌ కార‌ణంగానే టీ20 సిరీస్ మొత్తానికి 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని నిర్ణ‌యించిట‌న్లు జీసీఏ ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. ఇప్ప‌టికే స్టేడియం మొత్తాన్నీ సానిటైజ్ చేసిన‌ట్లు కూడా గుజ‌రాత్ అసోసియేష‌న్ తెలిపింది. మ్యాచ్‌కు వ‌చ్చే వాళ్లంతా క‌చ్చితంగా కరోనా నిబంధ‌న‌లు పాటించేలా స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేసిందట. శుక్ర‌వారం నుంచి ఈ నెల 20 వ‌ర‌కూ ఇదే స్టేడియంలో 5 టీ20లు జ‌ర‌గ‌నున్నాయి. టికెట్ల‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ల‌లో అమ్ముతున్నారు.

ఇప్పటివరకు భారత్-ఇంగ్లండ్ జట్లు 14 సార్లు టీ20ల్లో తలపడ్డాయి. అయితే ఇరు జట్లు సరిసమానంగా విజయాలు సాధించాయి. 7 సార్లు టీమిండిగా గెలిస్తే.. 7 సార్లు ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లలో రెండు జట్లూ ఎక్కువ శాతం గెలిచాయి. కాగా ఇంగ్లండ్, భారత్ కాకుండా బయటి పిచ్‌లపై జరిగిన మ్యాచ్‌లలో మాత్రం ఇంగ్లండ్‌పై భారత్ పూర్తిస్థాయి పైచేయి సాధించింది. 2007లో డర్బన్‌లో జరిగిన టీ20లోనూ, కొలంబోలో 2012లోనూ ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఇక చివరిగా 2018లో ఇంగ్లండ్‌లోని బ్రిస్టోల్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు‌ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది.

మొతేరా పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. మూడు, నాలుగు టెస్టులకు ఉపయోగించిన పిచ్‌తో పోలిస్తే ఈ పిచ్‌ భిన్నంగా ఉండబోతోంది. ఈ ట్రాక్‌పై బ్యాట్స్‌మెన్‌కు పరుగుల పండగ ఖాయం. అయితే ఈ జనవరిలో ముస్తాక్‌ అలీ టోర్నీ ఆడినప్పుడు పిచ్‌ నుంచి స్పిన్నర్లకు సహకారం అందింది. ఇక్కడ ఏడు మ్యాచ్‌లు జరగ్గా.. అయిదింట్లో తొలుత బౌలింగ్‌ చేసిన జట్టే నెగ్గింది. ఈ నేపథ్యంలో టాస్‌ కీలకం కాబోతోంది.

Story first published: Friday, March 12, 2021, 16:21 [IST]
Other articles published on Mar 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+