యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?

India vs England : Yuvraj Singh Mercilessly Trolled For His Tweet On Motera Pitch

అహ్మదాబాద్: మొతెరా పిచ్‌‌ను విమర్శిస్తూ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గురువారం చేసిన ట్వీట్‌పై తీవ్ర దుమారం రేగింది. భారత విజయాన్ని అవహేళన చేసేలా యువీ ట్వీట్ ఉందంటూ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ సిక్సర్ల సింగ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లండ్‌తో గురువారం ముగిసిన డే/నైట్ టెస్ట్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంపై మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో యువీ కూడా పిచ్‌ను తప్పుబట్టాడు.

కుంబ్లే, భజ్జీ 1000 వికెట్లు..

కుంబ్లే, భజ్జీ 1000 వికెట్లు..

ఇలాంటి వికెట్‌పై ఆడితే దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ టెస్ట్‌ల్లో వరుసగా 1000, 800 వికెట్లు సులువుగా తీసేవారని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ‘రెండు రోజుల్లోనే ఫలితం రావడం టెస్ట్ క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఈ వికెట్‌పై అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఆడితే వరుసగా 1000, 800 వికెట్లు తీసేవారు. ఏది ఏమైనా అద్భుత ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్‌కు 400 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌కు.. 100వ మ్యాచ్ ఆడిన ఇషాంత్‌కు అభినందనలు'అని పేర్కొన్నాడు.

ఊహించలేదు..

అయితే పిచ్‌ను తప్పుబడుతూ యువరాజ్ సింగ్ చేసిన ఈ ట్వీట్‌ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. రిటైర్మెంట్ అయిన తర్వాత యువీ నుంచి ఇలాంటి వైఖరిని ఊహించలేదని కామెంట్ చేస్తున్నారు. భజ్జీ, కుంబ్లే కన్నా అశ్విన్‌ ఎంతో నయమని, ఎందుకంటే వారిద్దరికంటే అతనే బ్యాటింగ్ బాగా చేయగలడని ట్వీట్ చేస్తున్నారు. ఒకే ఓవర్‌లో యువీ 36 పరుగులు చేసినప్పుడు కూడా ఇదే ఇంగ్లండ్ టీమ్ పిచ్‌పై ఆరోపణలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. భారత్ విజయాన్ని తక్కువ చేయవద్దని సూచిస్తున్నారు.

షమీ, ఇషాంత్..

యువీ లెక్కన షమీ, ఇషాంత్ ఇంగ్లండ్‌లో పుట్టి ఉంటే 600, 400 వికెట్లు పడగొట్టేవారా? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. అంతేకాకుండా ఇలాంటి పిచ్‌పై విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయగలిగితే 200 సెంచరీలు చేసేవాడా? అంటూ నిలదీస్తున్నారు. పిచ్‌ను తప్పుబట్టే బదులు బ్యాట్స్‌మెన్ స్కిల్స్ పెంచుకోమని సూచించవచ్చు కదా.. అని ఇంకోకరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పొట్టి ఫార్మాట్‌ కారణంగా బౌలర్లకు ఏన్నో నిద్రలేని రాత్రులు మిగులుతున్నాయని కామెంట్ చేశారు. అయితే యువీ అభిప్రాయంతో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఏకీభవించాడు.

లక్ష్మణ్, భజ్జీ కూడా..

లక్ష్మణ్, భజ్జీ కూడా..

మొతెరా పిచ్ టెస్ట్‌లకు సూటవ్వదని అందుకే భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌటైందని మాజీ క్రికెటర్, సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. మొతెరా పిచ్ టెస్ట్‌లకు ఏ మాత్రం సూటవ్వదని హర్భజన్ సింగ్ అన్నాడు. ఒకవేళ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 200పైగా పరుగులు చేసుంటే అప్పుడు భారత్ కష్టపడేదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా, ఇక మీద కూడా ఇలాంటి వికెట్లే ఇస్తామంటే ప్రతీ జట్టును మూడు ఇన్నింగ్స్‌లు ఆడించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శించాడు. ఇలాంటి పిచ్ వల్ల బ్యాట్స్‌మెన్ స్కిల్స్‌కు పరీక్ష ఎదురవుతుందని, ఇది ఈ ఒక్క మ్యాచ్‌కు అయితే ఓకే కానీ తర్వాత కూడా ఇలాంటి వికెట్లే ఇస్తామంటే ఏ క్రికెటర్ కూడా ఒప్పుకోడని ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు.

India vs England: మొతేరా పిచ్‌పై దెయ్యాలేం లేవు.. విమర్శకులపై రోహిత్‌ శర్మ ఫైర్!

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, February 26, 2021, 14:54 [IST]
Other articles published on Feb 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X