For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వ్యాఖ్యాతల కంటే పంతే ఎక్కువ కామెంటరీ చేస్తున్నాడు.. అతడికి డబ్బులు చెల్లించాలి'

India vs England: Fans ask for Separate Stump Mic Audio for Rishabh Pant

చెన్నై: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్ మైదానంలో ఉంటే ఆటగాళ్లకే కాదు అభిమానులకు ఎంతో సరదాగా ఉంటుంది. వికెట్ల వెనుక ఉండే పంత్.. తన అల్లరితో అందరిని నవ్విస్తుంటాడు. వికెట్ల వెనుక నుంచి పంత్.. 'కమాన్', 'అచ్చి బాల్'‌, 'సూపర్ బంతి' అంటూ పదేపదే బౌలర్లను ఎంకరేజ్ చేస్తుంటాడు. దీంతో మన బౌలర్లు రెట్టింపు ఉత్సాహంతో బంతులు వేస్తుంటారు. వికెట్లు పడగొట్టినప్పుడు వారి వద్దకు వెళ్లి ప్రశంసిస్తాడు. అంతేకాదు సహచర ఆటగాళ్లలో ఉత్తేజం నింపడానికి పాటలు కూడా పాడుతుంటాడు. మైదానంలో పంత్ చేసే అల్లరికి హద్దే ఉండదు.

అల్లరి చేష్టలు:

వికెట్ల వెనకాల రిషబ్ పంత్ చేసే అల్లరి చేష్టలకు ప్రత్యర్థులకు మతిపోతుంటుంది. కామెంటరీ కంటే ఎక్కువగా మాట్లాడుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంటాడు. చెన్నై చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ పంత్‌ అదే పని చేశాడు. దీంతో ఒకానొక సమయంలో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ నిరాశకు గురయ్యారు. పంత్ పదేపదే మాట్లాడుతుంటే అసహనానికి గురయ్యారు. అయితే మైదానంలో చురుకుగా ఉంటున్న పంత్‌ గురించి నెటిజన్లు సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అవి ఎంతో సరదాగా ఉన్నాయి.

వ్యాఖ్యాతల కంటే పంతే ఎక్కువ కామెంటరీ చేస్తున్నాడు:

'కామెంటరీ బాక్సులో ఉన్న వ్యాఖ్యాతల కంటే.. రిషబ్ పంతే ఎక్కువ కామెంటరీ చేస్తున్నాడు. అతడికి డబ్బులు చెల్లించాలి; అని ఓ నెటిజన్ సరదాగా ట్వీట్‌ చేయగా.. 'వీలైతే మైక్‌ స్టంప్‌ ఆడియో రికార్డును కొనుగోలు చేయాలని, ఎందుకంటే అందులో రిషబ్ పంత్ మాటలన్నీ ఉంటాయి' అని మరొకరు పోస్ట్ చేశారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడని మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్‌తో కామెంటరీ చేయాలని మరికొందరు కోరుతున్నారు. 'పంత్ బాగా ఎంకరేజ్ చేస్తున్నావ్', 'పంత్ మంచి ఎంటర్టైన్మెంట్' అని ఇంకొందరు అంటున్నారు.

రెండు అద్భుత క్యాచ్‌లు :

ఆస్ట్రేలియాలో సిరీస్‌లో బ్యాట్‌తో గొప్పగా ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్ వికెట్ల వెనకాల పేలవ ప్రదర్శన చేయాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ బ్యాట్‌తో మెరిసిన పంత్.. వికెట్‌ కీపర్‌గా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో రెండో టెస్టులో స్పిన్‌కు బాగా సహకరిస్తున్న పిచ్‌పై వికెట్ల వెనకాల పంత్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత అందరూ అతని బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌ను మెచ్చుకుంటున్నారు.

సూపర్‌ మ్యాన్‌ తరహాలో డైవ్‌ చేసి:

సూపర్‌ మ్యాన్‌ తరహాలో డైవ్‌ చేసి:

రెండో టెస్టులో వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ తన కీపింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. వికెట్ల వెనక మెరుపు వేగంతో కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకున్నాడు. భారత్‌లో తొలి టెస్టు ఆడుతున్న హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన తొలి బంతికే వికెట్‌ తీశాడు. ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మన్‌ ఓలీ పోప్‌ ఫ్లిక్‌ చేసేందుకు ప్రయత్నించగా.. బంతి అతని గ్లోవ్‌కు తగిలింది. బంతి తన ఎడమవైపు వెళ్తుండగా పంత్‌ సూపర్‌ మ్యాన్‌ తరహాలో డైవ్‌ చేసి అందుకున్నాడు. ఈ క్యాచ్‌ మ్యాచ్‌లోనే హైలెట్‌గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ మెరిశాడు.

చిక్కుల్లో టీమిండియా మాజీ క్రికెటర్.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు! చహల్‌ కారణంగానే!

Story first published: Monday, February 15, 2021, 13:57 [IST]
Other articles published on Feb 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+