India vs England: భారత ఫీల్డింగ్ తప్పిదాల్ని ఎద్దేవా చేస్తూ మైకేల్ వాన్ ట్వీట్.. మండిపడుతున్న ఫాన్స్!!

అహ్మదాబాద్: టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొతేరాలో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను కోహ్లీసేన చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన మోర్గాన్ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఛేదనలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సత్తా చాటి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
కోహ్లీ (73 నాటౌట్; 49 బంతుల్లో 5×4, 3×6), అరంగేట్ర ఓపెనర్ ఇషాన్ కిషన్ (56; 32 బంతుల్లో 5×4, 4×6) అర్ధ శతకాలతో రాణించారు. దీంతో భారత జట్టుపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాత్రం మరోసారి టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు.

భారత జట్టు కంటే.. ముంబై టీమ్ బెటర్
ముందుగా ఏం జరిగిందంటే.. అహ్మదాబాద్ వేదికగా గత శుక్రవారం జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన ఒదిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయి ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తయింది. మ్యాచ్ అనంతరం మైకేల్ వాన్ ఓ ట్వీట్ చేశాడు. 'భారత టీ20 జట్టు కంటే.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టే మెరుగైన టీమ్' ఎద్దేవా చేశాడు. దాంతో టీమిండియా అభిమానులు అతనిపై మండిపడ్డారు. భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. వాన్‌కు అదిరే రిప్లై ఇచ్చాడు. 'అన్ని జట్లకీ నలుగురు విదేశీ ఆటగాళ్లని ఆడించుకునే అదృష్టం ఉండదు' అని ఓ పంచ్ వేశాడు. ఇంగ్లండ్ టీమ్‌లో విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.
జాఫర్ దెబ్బకి వాన్ సైలెంట్
ఓపెనర్ జేసన్ రాయ్ దక్షిణాఫ్రికాలో జన్మించగా.. ఫాస్ట్ బౌలర్లు జోప్రా ఆర్చర్, క్రిస్ జోర్దాన్ వెస్టిండీస్‌లో పుట్టారు. ఇక కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్ నుంచి, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ న్యూజిలాండ్ నుంచి వలస వచ్చారు. కెవిన్ పీటర్సన్ కూడా విదేశీ ఆటగాడే అన్న విషయం తెలిసిందే. వసీం జాఫర్ దెబ్బకి మైకేల్ వాన్ సైలెంట్ అయిపోయాడు. ఇక రెండో టీ20లో కోహ్లీసేన గెలుపుపై వాన్ స్పందించాడు. భారత్ జట్టు ఫీల్డింగ్ తప్పిదాల్ని ఎద్దేవా చేస్తూ.. మరోసారి ముంబై ఇండియన్స్ పేరుని తెరపైకి తెచ్చాడు.
భారత ఆటగాళ్లు నా అకాడమీలో చేరండి
'నా ఫీల్డింగ్ అకాడమీలో చేరమని భారత జట్టును ఆహ్వానిస్తున్నా. ఇది చాలా ప్రత్యేకమైన క్లబ్' అని తాజాగా మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. రెండో టీ20లో భారత ఫీల్డర్లతో సహా ఇంగ్లీష్ ఫీల్డర్లు కూడా సులువైన క్యాచ్‌లను జారవిడిచారు. ఇషాన్ ఇచ్చిన సులువైన క్యాచును స్టోక్స్ జారవిడిచాడు. దీంతో వాన్ చేసిన ట్వీట్‌ని ఇప్పుడు భారత అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. 'నా షిట్ అకాడమీలో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. అది మీ ఫీల్డింగ్ అకాడమీ కంటే గొప్పది' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'మీ ఫీల్డింగ్ అకాడమీలో చేరితే.. ఉన్నది కూడా పోతది' అని మరొకరు ట్వీటారు. ఇలా వాన్, ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది.
పిచ్ విషయంలో వేలుపెట్టి
మొతేరా వేదికగా ఇటీవల ముగిసిన ఆఖరి టెస్ట్‌లో కోహ్లీసేన ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ విజయంపై స్పందించిన వాన్.. 'స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలిచినప్పుడే టెస్టుల్లో అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుంది. అప్పుడు ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉండదు' అని అభిప్రాయపడ్డాడు. ఇక మూడో టెస్ట్ పిచ్ విషయంలో కూడా వేలుపెట్టి నెటిజన్ల నుంచి అక్షింతలు వేయించుకున్నాడు.
India vs England: గతంలో కూడా ఇలాగే జరిగింది.. జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువ కీపర్..: సెహ్వాగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications