
సమతూకంగా ఇంగ్లండ్
ఇంగ్లండ్ ఇటీవల ఉపఖండ పిచ్‌లపై దుమ్మురేపిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనను ఇంగ్లండ్ 2-0 క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లీష్ స్పిన్నర్లు డోమ్ బెస్, జాక్ లీచ్ ఇద్దరూ 2 టెస్టుల్లో 22 వికెట్లు పడగొట్టారు. ఇక కెప్టెన్ జో రూట్ టెస్ట్ సిరీస్‌లో 426 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 186 ఇన్నింగ్స్ ఉంది. స్పిన్నర్లకు తోడుగా సీనియర్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ కూడా రాణించారు. పటిష్టమైన టాపార్డర్.. అనుభవజ్ఞులైన పేసర్స్.. నాణ్యమైన ఆల్‌రౌండర్స్‌తో సమతూకంగా ఇంగ్లండ్ సమతూకంగానే ఉంది.

బలమైన టాపార్డర్
లంకతో రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ బ్యాటింగ్ భారాన్ని జో రూట్ ఒక్కడే మోశాడు. తొలి టెస్టులో డబుల్ సెంచరీ బాదిన రూట్.. రెండో టెస్టులో భారీ శతకంతో జట్టును గెలిపించాడు. రూట్‌తో పాటు జాక్ క్రాలీ, డొమినిక్ సిబ్లే, బెన్ స్టోక్స్, జొస్ బట్లర్, మొయిన్ అలీతో కూడిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తున్నది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను నడిపించే సత్తా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ స్టోక్స్ ఉండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ కూడా బ్యాటింగ్ చేయగలగడం ఇంగ్లండ్‌కు అదనపు బలం.

అద్భుతాలు చేయగల పేస్ జోడి
పేస్‌కు పెద్దగా సహకరించని పిచ్‌లపై కూడా జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ అద్భుతాలు చేయగలరు. ఇది ఇంగ్లండ్‌కు అతిపెద్ద సానుకూలత. గతంలో ఇక్కడ పర్యటించిన అనుభవం ఉన్న ఈ పేస్ జంటను తక్కువ అంచనావేస్తే టీమిండియాకు ఓటమి తప్పకపోవచ్చు. వయసు పెరుగుతున్నా కొద్ది ఈ జోడీ అద్భుతాలు చేస్తున్నది. బౌలింగ్‌లో మంచి ఆరంభాలు ఇవ్వడంతో పాటు.. బ్యాట్‌తోనూ సత్తాచాటగలరు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు.. స్పిన్ విషయానికొచ్చేసరికి కాస్త బలహీనంగా కనిపిస్తున్నది. అయితే మరి అంత బలహీనంగా మాత్రం లేదు. అనుభవం ఉన్న మొయిన్ అలీతో పాటు బెస్, లీచ్ ఉన్నారు.

చరిత్ర చూసుకుంటే
చరిత్ర చూసుకుంటే ఓవరాల్‌గా భారత్‌పై ఇంగ్లండ్‌దే పైచేయిలా కనిపిస్తున్నా.. గత పర్యటనలో ఇంగ్లిష్ జట్టు ఇక్కడ ఘోరంగా ఓడింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టును డ్రా చేసుకున్న ఇంగ్లీష్ జట్టు.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి 0-4తో సిరీస్ కోల్పోయింది. గత పర్యటనలో ఆడిన ఆరుగురు ఆటగాళ్లు ప్రస్తుత జట్టులోనూ ఉన్నా.. రూట్, స్టోక్స్, ఆర్చర్‌పైనే టీమ్ మేనేజ్‌మెంట్ ఆశలు పెట్టుకుంది.
ఓ కండీషన్‌పై.. ఐపీఎల్ 2021లో ఆడేందుకు ఆసీస్ క్రికెటర్లకి అనుమతి!!


Click it and Unblock the Notifications












