8 బంతుల్లో 3 వికెట్లు: తొలి టెస్టులో కుర్రన్ అరుదైన రికార్డు

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ యువ బౌలర్ శామ్ కుర్రున్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 89.4 ఓవర్లలో 287 పరుగులు చేసి ఆలౌటైంది.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొమ్మిది పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ యువ బౌలర్ శామ్ కుర్రన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. దీంతో అతి చిన్న వయస్సులో ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు సాధించిన ఇంగ్లాండ్ క్రికెటర్‌గా కుర్రన్ రికార్డు సృష్టించాడు.
20 సంవత్సరాల 60 రోజుల్లో
కర్రన్ 20 సంవత్సరాల 60 రోజుల్లో సాధించాడు. ఈ మ్యాచ్‌లో కర్రన్ భారత్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‍ను 287 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం క్రీజులోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. భారత ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు.

మూడు వికెట్లు తీసిన శామ్ కుర్రన్
అయితే 20 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర శామ్ కురన్ బౌలింగ్‌లో మురళీ విజయ్ ఎల్బీగా ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కుర్రన్ వేసిన బంతిని మురళీ విజయ్ ఎదుర్కొన్నాడు. వెంటనే బౌలర్ ఎల్బీగా అప్పీల్ చేసినా అంపైర్ ఔటివ్వలేదు. దీంతో ఆ జట్టు కెప్టెన్ జో రూట్ రివ్యూ సాయం కోరాడు. రివ్యూలో మురళీ విజయ్(20) ఔట్‌గా తేలింది.
ఊపు మీద కనిపించిన రాహుల్‌ను ఔట్ చేసిన కర్రన్
అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ తొలి బంతికే ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించాడు. అయితే, ఆ తర్వాత బంతికే కేఎల్ రాహుల్(4) బౌల్డయ్యాడు. దీంతో ఒకే ఓవర్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం 16వ ఓవర్లో కుర్రన్ వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న ధావన్(26) స్లిప్‌లో ఉన్న మలాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

లంచ్ విరామ సమాయనికి భారత్ 76/3
దీంతో శామ్ కర్రన్ ఈ అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ విరామ సమాయనికి టీమిండియా 21 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం భారత్ ఇంకా 211 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ(9), అజ్యింకె రహానే(8) పరుగులతో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications