కసితో ఇంగ్లండ్.. మూడో టెస్టులో భారీ మార్పులు! ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై వేటు! టీ20 స్పెషలిస్ట్ ఆయేగా!!

లండన్: సొంతగడ్డపై భారత్‌తో జరిగిన తొలి టెస్టులో వరణుడి చలవతో తృటిలో ఓటమి తపించుకున్న ఇంగ్లండ్.. రెండో టెస్టులో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో మిగిలిన టెస్టుల్లో ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది రూట్ సేన. ఇందుకోసం మూడో టెస్టు నుంచే జట్టులో సమూల మార్పులకు చర్యలు చేపట్టింది. ఇద్దరు ఆటగాళ్లపై వేటు వేసి.. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ను జట్టులోకి తీసుకుంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో ఈనెల 25 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ పోరు కూడా మొదటి రెండు టెస్టుల్లానే హోరాహోరీగా సాగనుంది.

డేవిడ్ మలాన్ ఆయేగా:
భారత్‌తో లీడ్స్‌లో ఈనెల 25 నుంచి జరిగే మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం ప్రకటించారు. మూడో టెస్టు కోసం టీ20 స్పెసలిస్ట్ డేవిడ్ మలాన్‌ను జట్టులోకి తీసుకుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చివరి రెండు టెస్టుల్లో తడబడిన కారణంగా మలన్‌కు ఆహ్వానం అందింది.అలాగే బ్యాట్స్‌మెన్ డామ్ సిబ్లే, జాక్ క్రాలేను పక్కనపెట్టింది. దీంతో వీరు తిరిగి తమ కౌంటీ జట్లకు ఆడనున్నారు. జాక్ లీచ్ పేరును కూడా స్క్వాడ్‌లో ప్రస్తావించలేదు. కానీ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి ప్రత్యామ్నాయంగా ఇతడు జట్టుతోనే ఉండనున్నాడు. సీమర్ సాకిబ్ మహమూద్‌కూ చోటు కల్పించారు.

మూడేళ్ల క్రితం టెస్ట్ మ్యాచ్:
రోరీ బర్స్న్పై విమర్శలు వస్తున్నా మరోసారి అతడికి అవకాశం ఇచ్చింది జట్టు యాజమాన్యం. సిబ్లే గైర్హాజరుతో హసీబ్ హమీద్‌కు ఓపెనర్ అవకాశం రానుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం తన చివరి టెస్టు ఆడిన డేవిడ్ మలాన్... తాజా సీజన్‌లో ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడి 199 పరుగులు చేశాడు. అయితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్ స్థానంలో ఉన్న మలాన్.. దూకుడైన బ్యాటింగ్ శైలి తమ జట్టుకు ఉపయోగపడగలదని భావిస్తున్న ఇంగ్లండ్ అతడిని టెస్టులోకి ఎంచుకునే సాహసం చేసింది. మలాన్ అయినా జట్టును ఆడుకుంటాడేమో చూడాలి.

వుడ్ కోలుకోకపోతే:
లార్డ్స్‌లో భుజానికి గాయమైన స్టార్ పేసర్ మార్క్ వుడ్ త్వరగా కోలుకోవాలని ఇంగ్లండ్ యాజమాన్యం ఆశిస్తోంది. ఒకవేళ వుడ్ కోలుకోకపోతే.. పేసర్లు సకిబ్ మహ్మద్, క్రెయగ్ ఓవర్టన్ అతని స్థానాన్ని భర్తీ చేస్తారు. జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్, సామ్ కరన్ జతగా సకిబ్ లేదా క్రెయగ్ ఆడనున్నారు. ఇంగ్లండ్ పేసర్లలో అండర్సన్, రాబిన్సన్, ఉడ్ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఉడ్ దూరమయితే.. రూట్ సేనకు భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి.

రూట్ ఇదే ఫామ్ కొనసాగిస్తే:
భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (893 రేటింగ్ పాయింట్లు) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రూట్... రెండు, మూడు స్థానాల్లో ఉన్న స్టీవ్ స్మిత్ (891), మార్నస్ లబ్‌షేన్ (878)లను వెనక్కి నెట్టి ముందుకు దూసుకొచ్చాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన (901) టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. రూట్ మిగతా టెస్టుల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే.. టాప్ ర్యాంక్‌ను చేరుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

ఇంగ్లండ్ జట్టు:
జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, రోరి బర్న్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, సాకిబ్ మహమూద్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఒవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, మార్క్ ఉడ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications