For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG 5th Test: ఐదో టెస్టు రద్దు.. ఈసీబీకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?

India vs England: ECB loss INR 200 crores Due to Cancellation of 5th Test

లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న చివ‌రి టెస్ట్ ఈ రోజు ప్రారంభానికి కొన్ని గంట‌ల ముందు రద్ద‌యిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయ‌డానికి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో 'భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చ‌ర్చిస్తోంది. ఈసీబీతో బీసీసీఐకి మంచి సంబంధాలు ఉండ‌టంతో.. ఈ ర‌ద్ద‌యిన మ్యాచ్‌ను మ‌ళ్లీ నిర్వ‌హించే అంశంపై రెండు బోర్డులు చ‌ర్చిస్తున్నాయి. సరైన విండో కోసం చూస్తున్నాయి. అయితే వ‌చ్చే ఏడాది టీ20, వ‌న్డే సిరీస్ కోసం టీమిండియా మ‌ళ్లీ ఇంగ్లండ్ వెళ్లనుంది. అప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇక టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి గత ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో క్వారంటైన్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కి కరోనా సోకింది. అయినప్పటికీ నాలుగో టెస్ట్ ముగిసింది. ఇక ఐదో టెస్టుకి భారత జట్టు సిద్ధమవగా.. గురువారం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌‌‌‌కి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో బీసీసీఐ ఆందోళన చెందింది. భారత్ జట్టులో మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని భావించిన బీసీసీఐ, ఈసీబీ మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు మ్యాచుకు మూడు గంటల ముందు ప్రకటించాయి.

నిజానికి తొలుత మొదటి రోజు ఆటని మాత్రమే రద్దు చేసిన ఈసీబీ.. ఆ తర్వాత మ్యాచ్‌ని రీషెడ్యూల్‌కి ఉన్న అవకాశాల్ని పరిశీలించిందట. కానీ బీసీసీఐ ఆ రీషెడ్యూల్‌కి ఒప్పుకోకపోవడంతో.. మ్యాచ్‌ని ఈసీబీ రద్దు చేయక తప్పలేదు. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో ఐదో టెస్టుని రీషెడ్యూల్ చేస్తే.. ఐపీఎల్‌కి సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన బీసీసీఐ మ్యాచు రద్దుకే మొగ్గుచూపినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారం ఐదో టెస్టు సెప్టెంబరు 10 నుంచి 14 వరకూ జరగాల్సి ఉండగా.. 15న ఇంగ్లండ్ నుంచి టీమిండియాతో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా బయల్దేరి యూఏఈకి వెళ్లాల్సి ఉంది. దాంతో మ్యాచ్ రద్దు మినహా మరో మార్గం ఈసీబీకి లేకపోయింది. ఈ టెస్టు మ్యాచ్ రద్దుతో ఈసీబీకి సుమారు రూ.200 కోట్లు (20 మిలియన్లు) నష్టం వాటిల్లనుందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ప్రకటనలు, ప్రసార, మీడియా హక్కులతో పాటు టిక్కెట్ల ద్వారా వచ్చే భారీ ఆదాయం ఈసీబీ కోల్పోయింది. ఇక ఇప్పటివరకు ముగిసిన నాలుగు టెస్టుల్లో ఇండియా 2-1 లీడ్‌లో ఉంది.

Story first published: Friday, September 10, 2021, 20:45 [IST]
Other articles published on Sep 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+