India vs England Dream11 Prediction:కెప్టెన్‌గా జోరూట్..వైస్ కెప్టెన్‌గా కోహ్లీ..ఫస్ట్ టెస్ట్ ఫాంటసీ టిప్స్ ..

న్యూఢిల్లీ: భారత్-ఇంగ్లండ్‌ మధ్య జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు బుధవారం తెరలేవనుంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్‌తోనే ప్రతిష్టాత్మ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్‌‌ మొదలు కానుంది. డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్ జూలై 2021 నుంచి 2023 వరకు జరగనుంది. ఈ టోర్నీలో టెస్ట్ హోదా ఉన్న ప్రతీ దేశం ఇంట బయట మూడేసి సిరీస్‌లు ఆడనున్నాయి. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఈ ఐదు టెస్ట్‌ల సిరీసే డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్‌లో పెద్దది. నెలన్నర పాటు ఈ సిరీస్ కొనసాగనుంది.

IND vs Eng:టీమిండియాకు గట్టి షాక్.. సిరాజ్ రాకాసి బౌన్సర్‌తో స్టార్ ఓపెనర్‌కు తీవ్ర గాయం!IND vs Eng:టీమిండియాకు గట్టి షాక్.. సిరాజ్ రాకాసి బౌన్సర్‌తో స్టార్ ఓపెనర్‌కు తీవ్ర గాయం!

దాంతో ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అంతేకాకుండా సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించేందుకు కోహ్లీసేన తహతహలాడుతోంది. న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎదురైన పరాభావం నుంచి పాఠాలు నేర్చుకున్న కోహ్లీసేన మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో భారత్ వేదికగా ఎదురైన వరుస పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని జోరూట్ సేన భావిస్తోంది. ఈ క్రమంలో ఈ సిరీస్ ద్వారా అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా లభించనుంది.

గోపీచంద్ అకాడమీ వీడటంతోనే మెడల్ సాధించా: పీవీ సింధుగోపీచంద్ అకాడమీ వీడటంతోనే మెడల్ సాధించా: పీవీ సింధు

భారత జట్టు న్యూస్..

భారత జట్టు న్యూస్..

ఇక మయాంక్ అగర్వాల్ కంకషన్‌తో ఫస్ట్ టెస్ట్‌కు దూరమవ్వడంతో రోహిత్‌కు జతగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయమైంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్‌లు మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌కు చోటు ఖాయం. గ్రీన్ వికెట్‌ సిద్దం చేస్తున్న వేళ భారత నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. దాంతో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్‌కి చోటు దక్కడం ఖాయం. ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌లో ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కనుంది. స్వింగ్ నేపథ్యంలో సిరాజ్‌కు ప్రాధన్యత ఇచ్చే అవకాశం ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు.

భారత్(అంచనా): రోహిత్, రాహుల్, పుజారా, కోహ్లీ, రహానే, పంత్, శార్దూల్, అశ్విన్, షమీ/ సిరాజ్, ఇషాంత్, బుమ్రా

ఇంగ్లండ్ టీమ్ న్యూస్..

ఇంగ్లండ్ టీమ్ న్యూస్..

రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్ 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జోరూట్ జట్టును నడిపించనున్నాడు. మానసిక సమస్యలతో బెన్ స్టోక్స్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. క్రైగ్ ఓవర్టన్ అతని స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లో ఓలీ పోప్ ఆడటం అనుమానమే.

ఇంగ్లండ్ తుది జట్టు:(అంచనా)

రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలీ, జోరూట్(కెప్టెన్), డానియల్ లారెన్స్/జాక్ లీచ్, జానీ బెయిర్ స్టో, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్

 డ్రీమ్ 11 ప్రిడిక్షన్/ఫాంటసీ టీమ్

డ్రీమ్ 11 ప్రిడిక్షన్/ఫాంటసీ టీమ్

వికెట్ కీపర్: పంత్

బ్యాట్స్‌మన్: రోహిత్ శర్మ, అజింక్యా రహానే, జోరూట్(వైస్ కెప్టెన్), రోరీ బర్న్స్, విరాట్ కోహ్లీ(కెప్టెన్)

ఆల్‌రౌండర్: రవిచంద్రన్ అశ్విన్

బౌలర్లు: ఇషాంత్ శర్మ, జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, సిరాజ్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, August 3, 2021, 7:15 [IST]
Other articles published on Aug 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X