India vs England 5th Test Weather : తొలి రోజు వర్షార్పణమే.. ‘టెస్ట్’ పెట్టనున్న వరుణ దేవుడు..!

ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా అయిదో టెస్ట్‌కు ముందు వరుణదేవుడు కాస్త టెస్ట్ పెట్టేలా ఉన్నాడు. ఇంగ్లాండ్ వాతావరణం వేసవిలో కూడా అంచనా వేయడం కష్టమే. వాన ముప్పు ఈ మ్యాచ్‌కు పొంచి ఉంది. ప్రస్తుతం ఇరు టీంల మధ్య రసవత్తర పోరు ఖాయమనుకున్న దశలో వరుణదేవుడు సమాయాత్తమవుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ఇటీవలే డిఫెండింగ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ అయిన న్యూజిలాండ్‌ను 3-0తేడాతో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు విజయోత్సాహంతో ఉంది. ఇక మరోవైపు.. కోవిడ్ వల్ల టీమిండియా జట్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడంతో.. కొత్త కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో ఇంగ్లాండ్ విజయోత్సాహాన్ని కాస్త చల్లార్చేలా గెలిచి చూపించాలని ఇండియా తహతహలాడుతుంది.

77 నుంచి 83 శాతం డౌటే
ఈరోజు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉష్ణోగ్రత రాత్రి టైంలో 11డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుందని, డే టైంలో 19డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని weather.com పేర్కొంది. ఇక తొలి రోజు 77 నుంచి 83శాతం వర్షం కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఇక ఇండియా టైం ప్రకారం.. మ్యాచ్ మధ్యాహ్నం 3:00కు.. ఇంగ్లాండ్ టైం ప్రకారం.. మధ్యాహ్నం 12:30కి మ్యాచ్ ప్రారంభం కావాలి. ఇక మధ్యాహ్నం అంటే మ్యాచ్ టైంలో 75% మేర వర్షం కురవొచ్చని అంచనా వేసింది. అలాగే రాత్రి 12%మేర వర్షపాతం నమోదయ్యే వీలుందని తేలింది. ఇక ఈ మ్యాచ్‌లో తేమ కూడా 76-81% మేర ఉంటుందని చెప్పింది.

తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్ లాంటి జట్టును..
ఇక కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా తన తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్ లాంటి దుర్భేద్యమైన టీంను ఢీకొనబోతుండడం గమనార్హం. ఇక కెప్టెన్సీ విషయంలో కచ్చితంగా తన చాకచాక్యాన్ని బుమ్రా ప్రదర్శించాలని చూస్తాడు. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజలో ఉంది. గతేడాది జరిగిన ఈ సిరీస్ చివరి మ్యాచ్ కరోన వ్యాప్తి వల్ల వాయిదా పడింది. అప్పటి జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా విరాట్ వైదొలిగిన సంగతి తెలిసిందే.

తుది జట్టును ఇంకా ప్రకటించని భారత్
భారత జట్టు అంచనా :
కేఎస్ భరత్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్)
ఇంగ్లాండ్ జట్టు:
అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్(కీపర్), జాక్ లీచ్, మ్యాటీ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications