India vs England: ఏం బాధపడకు సిబ్లీ.. మా పుజారా కూడా ఇలాగే ఔటయ్యాడు!!

అహ్మదాబాద్: క్రికెట్ ఆటలో ఒక్కోసారి కొన్ని ఘటనలు ఒకేవిధంగా జరుగుతుంటాయి. ఒకేవిధమైన కాచులు, ఒకే రీతిలో బ్యాట్స్‌మన్ ఔట్ అవ్వడం లాంటివి చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు బ్యాట్స్‌మన్ ఒకే రీతిలో ఔట్ అయ్యారు. టీమిండియా టెస్ట్ స్పెసలిస్ట్ చటేశ్వర్ పుజారా, ఇంగ్లండ్ ఓపెనర్ డామ్ సిబ్లీ ఒకేలా పెవిలియన్ చేరారు. ఇద్దరూ నేరుగా ఔట్ అవ్వలేదు. అదెలానో ఓసారి చూద్దాం.

ఆశ్చర్యపోయిన సిబ్లీ:
భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ చివరి బంతిని డామ్ సిబ్లీ స్వీప్ షాట్‌కు యత్నించాడు. అయితే అతను కొట్టిన బంతి టీమిండియా ఫీల్డర్ శుభ్‌మన్ గిల్ ప్యాడ్లను తాకి గాల్లోకి లేచింది. అప్పటికే క్యాచ్ అందుకునేందుకు ముందుకు వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ బంతిని ఒడిసిపట్టాడు. అయితే అంపైర్ ఔట్ ఇచ్చినా.. ఎక్కడో కాస్త అనుమానం ఉండడంతో థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. అయితే రిప్లేలో సిబ్లీ అవుట్ అని రావడంతో ఆశ్చర్యపోయిన అతడు నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు.

పుజారా కూడా:
డామ్ సిబ్లీ అవుటైన విధానంలోనే చటేశ్వర్ పుజారా కూడా ఔటయ్యాడు. ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అచ్చం సిబ్లీ తరహాలోనే వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 51వ ఓవర్ వేసిన స్పిన్నర్ డొమినిక్ బెస్ బౌలింగ్‌లో పుజారా స్వ్కేర్ లెగ్ దిశగా బంతిని ఫుల్ చేశాడు. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ అయ్యింది. కానీ బంతి నేరుగా వెళ్లి షార్ట్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ భుజానికి తాకి మిడాన్‌లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఉన్న రోరీ బర్న్స్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పుజారా బ్యాట్‌ను నేలకేసి కొడుతూ నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఏం బాధపడకు సిబ్లీ:
పుజారా, సిబ్లీ యాదృశ్చికంగా ఒకే సిరీస్‌లో ఔట్ అవ్వడం విశేషం. సిబ్లీ అవుటైన వీడియోనూ పుజారా వీడియోతో షేర్ చేసి నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 'ఏం బాధపడకు సిబ్లీ.. మా పుజారా కూడా ఇలాగే ఔటయ్యాడు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'అప్పుడు పుజారా.. ఇప్పుడు సిబ్లీ' అని మరొకరు ట్వీట్ చేశారు. ఇక టీమిండియా నాలుగో టెస్టులో మరింత పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్ అయిన కోహ్లీసేన.. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు తీసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే ఇంకా 51 పరుగులు చేయాల్సి ఉంది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్‌లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications