Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరి టెస్టు చెన్నైలోనే: గాయం కారణంగా షమీ, సాహా దూరం

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన ఐదో టెస్టు చెన్నైలోనే జరగనుంది. ఈనె 6వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపథ్యంలో టెస్టు వేదికను మార్చనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆలోచనను బీసీసీఐ విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితులు సాధారణంగా ఉండటంతో వేదిక మార్పును పక్కకు పెట్టాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భావిస్తోంది. టెస్టు మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన తమిళనాడు స్పోర్ట్స్ అథారిటీ నుంచి బీసీసీఐకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తాజా ప్రకటన చేశారు.

India vs England Chennai Test 2016 to go ahead

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ యాధావిధిగా షెడ్యూల్ ప్రకారం చెన్నైలోని జరుగుతుందని ఆయన సోమవారం ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతానికి చెన్నై వేదికగానే మ్యాచ్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.

చెన్నై టెస్టుకు షమీ, సాహా దూరం
ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో టెస్టుకు గాయాల నుంచి ఇంకా కోలుకోని టీమిండియా ఆటగాళ్లు మహ్మద్‌ షమీ, వృద్ధిమాన్‌ సాహా దూరమయ్యారు. ఐదు టెస్టుల సిరీస్‌ లో భాగంగా చివరదైన ఐదో టెస్టు డిసెంబర్ 16 నుంచి చెన్నైలో జరగనుంది. తొడ కండరాల గాయం కారణంగా సాహా మూడు, నాలుగో టెస్టు ఆడని సంగతి తెలిసిందే.

కుడి మోకాలి గాయంతో బాధపడుతున్న పేసర్ షమీ ముంబై టెస్టుకు దూరమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో సాహా విశ్రాంతి తీసుకుంటుండగా, షమీని కూడా అక్కడకు పంపనున్నారు. వైద్య బృందం వారిద్దరికి విశ్రాంతి అవసరమని చెప్పిందని బీసీసీఐ కార్యదర్శి అజయ్‌ షిర్కే ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

చెన్నై టెస్టుకు సిద్ధం: ట్విట్టర్‌లో అశ్విన్

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+