For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓటమి ముంగిట్లో నిలిచిన భారత్.. ఇంగ్లాండ్ బౌలర్ల విజృంభణ

India vs England 2018 5 Test : Alastair Cook Slams Ton In Farewell Test
 India vs England: Chasing 464, Kohli and men falter as final Test heads Englands way

లండన్: ఐదో టెస్టులో టీమిండియాకు పరాజయం తప్పే అవకాశాలే లేవు. ఇప్పటికే 464 పరుగుల ఛేదనలో వరుస వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంగ్లాండ్‌ పేసర్ల ధాటికి నిలువలేకపోయిన భారత్‌ 58/3తో కష్టాల్లో పడింది. పర్యటనలోనే చివరి మ్యాచ్ అవడంతో ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎదురు నిలిచి ఆఖరి రోజంతా నిలవాలంటే భారత్‌ బ్యాట్స్‌మెన్‌ అసాధారణంగా పోరాడాల్సిందే.

1
42378
రెండో ఇన్నింగ్స్‌ మొదలు కాగానే భారత్‌:

రెండో ఇన్నింగ్స్‌ మొదలు కాగానే భారత్‌:

భారీ లక్ష్యాన్ని చూసి బెదిరిపోయారో లేక... ఇంగ్లాండ్‌ పేస్‌కు నిలువలేకపోయారో కానీ టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ మొదలు కాగానే భారత్‌ వికెట్లు టపటపా పడిపోయాయి. వైఫల్యాలను కొనసాగిస్తూ ఓపెనర్‌ ధావన్‌ (1) అండర్సన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోగా.. పుజారా కూడా అండర్సన్‌కే ఎల్బీగా చిక్కాడు. అన్నింటికంటే షాక్‌ ఏంటంటే భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్‌ కావడం. బ్రాడ్‌ సంధించిన ఔట్‌ స్వింగర్‌ కోహ్లి బ్యాట్‌ అంచును ముద్దాడుతూ వికెట్‌కీపర్‌ బెయిర్‌స్టో చేతిలో వాలింది.

సంయమనంతో ఆడిన రాహుల్‌, రహానె:

సంయమనంతో ఆడిన రాహుల్‌, రహానె:

దీంతో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో రాహుల్‌, రహానె సంయమనంతో ఆడారు. రహానె ఆచితూచి బ్యాటింగ్‌ చేయగా.. రాహుల్‌ దూకుడుగా ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. వీళ్లిద్దరు అభేద్యమైన నాలుగో వికెట్‌కు 55 పరుగులు జత చేశారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌ బౌలర్‌గా.. మెక్‌గ్రాత్‌ (563) రికార్డును అండర్సన్‌ సమం చేశాడు.

సెంచరీతో వీడ్కోలు పలికిన కుక్:

సెంచరీతో వీడ్కోలు పలికిన కుక్:

అంతకముందు అలిస్టర్‌ కుక్‌ (147; 286 బంతుల్లో 14 ఫోర్లతో అదరగొట్టాడు. సెంచరీతో తన ఆఖరి ఇన్నింగ్స్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. 114/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ను కుక్‌, రూట్‌ (125) 190 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సు సెంచరీలతో నడిపించారు. ఈ జోడీ క్రీజులో పాతుకుపోయి పరుగులు సాధించడంతో భారత బౌలర్లు చేతులెత్తేశారు. లంచ్‌ సమయానికి 243/2తో పటిష్టమైన స్థితిలో నిలిచింది ఇంగ్లాండ్‌. అప్పటికి కుక్‌ 210 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇంగ్లాండ్‌ స్కోరు జోరు పెంచిన కుక్‌, రూట్‌

ఇంగ్లాండ్‌ స్కోరు జోరు పెంచిన కుక్‌, రూట్‌

లంచ్‌ తర్వాత కుక్‌, రూట్‌ జోరు పెంచడంతో ఇంగ్లాండ్‌ స్కోరు పరుగులెత్తింది. ఈ క్రమంలో రూట్‌ 151 బంతుల్లో సెంచరీని సాధించాడు. ఈ జోడీని ఆఫ్‌ స్పిన్నర్‌ హనుమ విహారి వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో కుక్‌-రూట్‌ల 259 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. స్టోక్స్‌ (37), కరన్‌ (21), రషీద్‌ (20 నాటౌట్‌) ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్‌ 423/8 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. విహారి (3/37), జడేజా (3/179), షమి (2/110) రాణించారు. గాయం కారణంగా ఇషాంత్‌ 8 ఓవర్లే వేశాడు.

Story first published: Tuesday, September 11, 2018, 10:16 [IST]
Other articles published on Sep 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+