Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెన్‌స్టోక్స్ కళ్లుచెదిరే క్యాచ్..ఇదేం రివెంజ్‌రా! (Video)

వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు‌లో ఇంగ్లండ్ తిరిగి పోటీలోకి వస్తుంది. ఓవర్‌‌నైట్ స్కోరు 28/0తో మూడో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా లంచ్ విరామానికి 130 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆదివారం ఆట మొదలైన కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (13; 21 బంతుల్లో), డబుల్ సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్ (17; 27 బంతుల్లో)ను ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ పెవిలియన్‌కు చేర్చాడు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ (62*; 79 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (29; 52 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టస్థితిలో నిలబెట్టారు. కానీ బెన్ స్టోక్స్ అద్భుతమైన క్యాచ్‌కు శ్రేయస్ వెనుదిరగాల్సి వచ్చింది. టామ్ హర్ట్‌లీ వేసిన బంతిని శ్రేయస్ భారీ షాట్‌కు యత్నించాడు. కానీ అది బ్యాట్‌కు సరిగా కనెక్ట్ అవ్వలేదు. అయినా బంతి ఫీల్డర్లుకు చాలా దూరంగా మిడాఫ్ వైపు గాల్లోకి లేచింది.

India vs England: Ben stokes taking stunning catch Shreyas Iyer shocked

కానీ బెన్ స్టోక్స్ దాన్ని వదిలిపెట్టలేదు. బంతిని చూస్తూ వెనక్కి పరిగెత్తూ అద్భుతంగా డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కుదురుకున్న శ్రేయస్ ఔటయ్యాడు. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లోనూ శ్రేయస్ అయ్యర్ ఇదే తరహాలో డైవ్ చేస్తూ కళ్లుచెదిరేలా క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది.

తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లకు ఇంగ్లండ్ 114/1తో మెరుగైన స్థితిలో ఉంది. ఈ సమయంలో అక్షర్‌ వేసిన బంతిని జాక్ క్రాలే (76; 78 బంతుల్లో) షాట్‌కు యత్నించగా శ్రేయస్‌ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. వెనక్కి పరుగెత్తి, ముందుకు డైవ్‌ చేస్తూ శ్రేయస్ బంతిని ఒడిసిపట్టాడు. ఇప్పుడు శ్రేయస్‌ను స్టోక్స్ ఇదే రీతిలో ఔట్ చేయడం గమనార్హం. దీంతో 'ప్లాన్ చేస్తున్నట్లుగా ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ సాగుతుందని, ప్రతీకారం తీర్చుకోవడానికే బెన్ స్టోక్స్ క్యాచ్ అందుకున్నట్లుగా ఉందని' నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇంగ్లండ్ జట్టులో క్రాలే టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు సాధించగా, ఇంగ్లిష్ జట్టు 253 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Sunday, February 4, 2024, 12:46 [IST]
Other articles published on Feb 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+