
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్నచివరిదైన నాలుగవ టెస్టులో కూడా భారత స్పిన్నర్లు హవా నడుస్తోంది. రెండవ ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరి దాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. దీంతో 13 ఓవర్లలోనే ఇంగ్లండ్ తొలి నాలుగు వికెట్లను కోల్పోయింది. అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ కూడా రెండు వికెట్లు వేసుకున్నాడు. క్రీజులో జో రూట్, ఓలి పోప్ ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 124 పరుగులు వెనకబడి ఉంది.
భారత్ ఆలౌట్ అనంతరం భోజన విరామ సమయానికి ముందు ఇంగ్లండ్ 3 ఓవర్లలో 6 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్ జట్టుకు కోహ్లీసేన షాకిచ్చింది. అశ్విన్ బౌలింగ్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. క్రాలే (5), బెయిర్‌స్టో (0)లు పెవిలియన్‌కు చేరారు. ఇద్దరూ క్యాచ్ ఔట్ అయ్యారు. ఆపై అక్షర్ వేసిన 10వ ఓవర్ చివరి బంతికి సిబ్లీ (3) ఔటయ్యాడు. సిబ్లీ స్వీప్ షాట్ ఆడగా.. బంతి షార్ట్ లెగ్ ఫీల్డర్‌కు తాకి గాల్లోకి లేచింది. దీంతో కీపర్ పంత్ క్యాచ్ అందుకొని సిబ్లీని పెవిలియన్ పంపాడు. దీంతో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్(2) అక్షర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ విరాట్ కోహ్లీ చేతికి చిక్కాడు. టీమ్‌ఇండియా బౌలర్లు విజృంభిస్తుండడంతో 30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. అయితే కెప్టెన్ జో రూట్ మాత్రం క్రీజులో ఉన్నాడు. అతనికి తోడుగా పోప్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 48 రన్స్ చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 160 రన్స్ ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగవ టెస్ట్‌పైన కూడా పట్టు సాధించింది. ఇన్నింగ్స్ తేడాతోనే విజయాన్ని ఖాతాలో వేసుకునే దిశగా టీమిండియా ముందుకువెళ్తోంది.