న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగో టెస్టులో తొలి బంతి నుంచే టర్నింగ్ ఉంటుంది! బాగా ఆడడానికి సరైన మార్గం కనుగొనాలి: ఫోక్స్‌

India vs England: Ben Foakes says We Know Ahmedabad pitch going to spin from ball one

అహ్మదాబాద్: నాలుగో టెస్టులో తొలి బంతి నుంచే విపరీతమైన టర్నింగ్‌ ఉంటుందని తాము అనుకుంటున్నామని ఇంగ్లండ్ వికెట్‌ కీపర్‌ బెన్ ‌ఫోక్స్‌ అభిప్రాయపడ్డాడు. చివరి టెస్టులో తమ జట్టు మరింత బాగా బ్యాటింగ్‌ చేయడానికి సరైన మార్గం కనుగొనాలని తెలిపాడు. మూడో టెస్టులో తమ జట్టు పూర్తిగా విఫలమైందని, భారత్ బాగా ఆడిందన్నాడు. గుజ‌రాత్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన డేనైట్ టెస్ట్ మ్యాచ్ కేవ‌లం రెండు రోజుల్లోపే ముగిసిన విష‌యం తెలిసిందే. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (11), రవిచంద్రన్ అశ్విన్ (7) చెలరేగడంతో 10 వికెట్ల తేడాతో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది.

India vs England: మొతేరా పిచ్‌పై రోహిత్ ట్వీట్.. ట్రోల్ చేసిన రితిక!!India vs England: మొతేరా పిచ్‌పై రోహిత్ ట్వీట్.. ట్రోల్ చేసిన రితిక!!

నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు:

నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు:

నాలుగో టెస్టుకు ముందు బెన్ ‌ఫోక్స్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... 'నిజం చెప్పాలంటే మూడో టెస్టులో మేం పూర్తిగా విఫలమయ్యాం. చెన్నై, మొతేరా పిచ్‌లు చాలా కష్టతరమైనవి. కానీ టీమిండియా మాకన్నా బాగా ఆడింది. భారత జట్టులో పలువురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి వారు వైవిధ్య బంతులు వేస్తారు. దాంతో వారి బౌలింగ్‌కు మా వద్ద సమాధానం కరవైంది. ఇక రాబోయే మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఆడి వారిని ఎదుర్కొని భారీ స్కోర్‌ సాధించాలి' అని అన్నాడు.

సరైన మార్గం అన్వేషించాలి:

సరైన మార్గం అన్వేషించాలి:

'మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఎలాంటి పిచ్‌ ఉండబోతుందనే విషయంపై మాకో స్పష్టమైన అవగాహన ఉంది. తొలి బంతి నుంచే విపరీతమైన టర్నింగ్‌ ఉంటుందని మేం అనకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో బాగా ఆడడానికి సరైన మార్గం అన్వేషించాలి. గత రెండు టెస్టుల్లోనూ పిచ్‌ కఠినంగా ఉంది. ఇలాంటి వాటిని ముందెప్పుడూ చూడలేదు. పింక్‌బాల్‌ టెస్టులో బంతి మరీ ఎక్కువగా తిరిగింది. ఇలాంటి పిచ్‌లపై కీపింగ్‌ చేయడం కష్టంగా మారింది. వరుసగా రెండు టెస్టులు ఓటమిపాలైనా ఇప్పటికీ మాకు సిరీస్‌ డ్రా చేసుకునే అవకాశం ఉంది' అని బెన్ ‌ఫోక్స్‌ చెప్పాడు. చివరి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసి 2-2తేడాతో తిరిగి స్వదేశానికి వెళితే బాగుంటుందని ఫోక్స్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ప్రాక్టీస్ మొదలు:

ప్రాక్టీస్ మొదలు:

డేనైట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేయగా.. భారత్‌ 145 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌటవ్వడంతో.. భారత్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టు మొతేరా స్టేడియంలో మార్చి 4న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు.

Story first published: Monday, March 1, 2021, 13:18 [IST]
Other articles published on Mar 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X