
ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఇదే తొలి టెస్టు
‘ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఇదే తొలి టెస్టు. అందుకే స్టేడియం మొత్తం హౌస్‌ఫుల్ కావాలనేది మా లక్ష్యం. భద్రత కారణాల వల్ల ముందుగా ప్లాన్ చేయలేకపోయాం. తొలిరోజు ప్రతి ఒక్కరూ ఫ్రీగా మ్యాచ్‌ను వీక్షించవచ్చు. తొలిరోజు పరిస్థితిని బట్టి వీలైతే మిగతా రోజుల్లోనూ దాన్ని కొనసాగిస్తామ'ని గంగరాజు తెలిపారు.

విశాఖ టెస్టుపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం
రూ. 500, రూ. 1000 రూపాయల నోట్లను ప్రధాని మోడీ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా విశాఖ టెస్టు టిక్కెట్ల అమ్మకాలపై పడింది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియం మొత్తం సామర్థ్యం 28 వేలు. ఏసీఏ తీసుకున్న తాజా నిర్ణయంతో స్టేడియం నిండిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల్లలోని 10వేల మంది విద్యార్ధులకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తోంది.

2003లో పాక్-భారత్ మధ్య తొలి వన్డే
ఏసీఏ- వీడీసీఏ స్టేడియం దేశంలోనే అందమైన క్రికెట్ స్టేడియాల్లో ఒకటి. 2003లో టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఇక్కడ తొలి వన్డే జరిగింది. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈ స్టేడియంలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టీమిండియాకు అచ్చొచ్చిన స్టేడియం. లక్ష్య ఛేదనలో కోహ్లీకి తిరుగులేదని నిరూపించింది ఈ స్టేడియమే.

విశాఖ పిచ్‌కు పూజ
విశాఖ తొలిసారిగా టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో కొత్తగా రూపొందించిన పిచ్‌కు పండితుల సమక్షంలో వేద మంత్రాలతో శాస్ర్తోక్తంగా పూజ నిర్వహించారు. ఏసీఏ అధ్యక్షుడు డీవీవీ సోమయాజులు, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, కోచ్ అనిల్ కుంబ్లే, బీసీసీఐ క్యూరేటర్ శ్రీరాం, ఏసీఏ క్యూరేటర్ నాగమల్లయ్యలు ఈ పూజలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











