ఫోటోలు: కొత్త పెళ్లికొడుకు ఇషాంత్‌కు కోహ్లీ గిప్ట్ ఇదే
చెన్నై: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలోని చిదరంబరం స్టేడియంలో జరుగుతున్న ఐదో టెస్టులో కొత్త పెళ్లికొడుకు ఇషాంత్ శర్మకు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. తుది జట్టులో పేసర్ భువనేశ్వర్ కుమార్ స్ధానంలో ఇషాంత్ శర్మకు చోటు కల్పించాడు.
చెన్నై టెస్టుకు టీమిండియాలో జట్టు మేనేజ్‌మెంట్ రెండు కీలక మార్పులు చేసింది. గాయపడ్డ జయంత్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో స్ఫిన్నర్ అమిత్ మిశ‍్రాను తుది జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు భువనేశ్వర్ కుమార్ స్థానంలో స్ఫిన్నర్ ఇషాంత్ శర్మకు చోటు కల్పించింది.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో ఇషాంత్ శర్మ చోటు దక్కించుకున్నా పెళ్లి కారణంగా ముంబై టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్‌తో ఇషాంత్ శర్మ వివాహం గుర్గావ్‌కు సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో డిసెంబర్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
పెళ్లి అనంతరం చెన్నై టెస్టులో ఆడుతున్న ఇషాంత్ శర్మ జెన్నింగ్స్‌ను ఔట్ చేశాడు. దీంతో 7 పరుగులకే ఇంగ్లాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 5.2వ ఓవర్లో ఇషాంత్ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో పార్థివ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చిన జెన్నింగ్స్ పెవిలియన్ బాటపట్టాడు.
ఆఫ్ స్టంప్‌కు వెలుపల ఇషాంత్ వేసిన బంతిని జెన్నింగ్స్ డ్రైవ్ చేయబోగా అది ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని కీపర్ పార్థివ్ పటేల్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అరంగేట్రం చేసిన ముంబై టెస్టులో జెన్నింగ్స్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే రెండో టెస్టులో ఒక్క పరుగుకే ఔటయ్యాడు.
జెన్నింగ్స్ వికెట్ తీసిన కొత్త పెళ్లికొడుకు ఇషాంత్‌పై ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు:
అయాజ్ మీమన్ ఇలా
తుది జట్టులో చోటు కల్పించడమే కొత్త పెళ్లికొడుకు ఇషాంత్‌కు కోహ్లీ, కుంబ్లే ఇచ్చిన గిఫ్ట్.
ఇషాంత్ శర్మ రాకతో అభిమానుల సంతోషం
చెన్నై టెస్టుతో తిరిగి తుది జట్టులో ఇషాంత్ శర్మ చోటు దక్కించుకోవడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు.
కుక్‌ను 8 సార్లు ఔట్ చేసిన ఇషాంత్
ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్‌ను ఇషాంత్ శర్మ 8 సార్లు ఔట్ చేసాడు.
100వ వికెట్ తీసుకున్న ఇషాంత్
చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో జెన్నింగ్స్ వికెట్ ఇషాంత్ శర్మకు ఆసియాలో 100వ వికెట్.
సంతోషంలో ఫ్యాన్స్
చెన్నై టెస్టులో తొలి వికెట్ సాధించిన ఇషాంత్ శర్మ.
పెళ్లితో ఇషాంత్ ఫామ్‌లోకి
పెళ్లి చేసుకున్న వారికి వికెట్లు ఎలా తీయాలో బాగా తెలుసు అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications