బుమ్రా విధ్వంసం కొనసాగిందిలా..
84వ ఓవర్లో బ్రాడ్ బౌలింగ్ అందుకునే సరికి.. టీమిండియా స్కోరు 377/9. ఇక క్రీజులో బుమ్రా బ్యాటింగ్లో ఉన్నాడు.
తొలి బంతికి 4: ఇక తొలి బంతికి బ్రాడ్ లెగ్ సైడ్ వేయగా.. బుమ్రా హిట్ చేశాడు. కాస్త కష్టమైన ఆ క్యాచ్‌ను జాక్ క్రాలీ అందుకోవాల్సింది. కానీ అందుకోలేకపోయాడు. దీంతో ఫోర్ వచ్చింది. 4 పరుగులు.
2వ బంతికి వైడ్ ఫోర్ : ఇక రెండో బంతికి బ్రాడ్ బీమర్ వేశాడు. దాన్ని అంపైర్ వైడ్ ఇచ్చాడు. అది కీపర్‌కు అందకపోవడంతో ఫోర్ పోయింది. 5పరుగులు
2వ బంతికి నోబాల్ సిక్స్ : రెండో బంతికి షార్ట్ బాల్ వేయగా.. దాన్ని బుమ్రా హిట్ చేయడంతో బ్యాక్ సైడ్ సిక్స్ పోయింది. అయితే దాన్ని అంపైర్ నోబ్ ఇచ్చాడు. దీంతో 7పరుగులు.
3వ బంతికి ఫోర్ : టాస్ వేయగా.. లాంగాన్లో ఫోర్ బాదాడు. బుమ్రా ఫోర్ కొట్టి కిందపడ్డాడు. ఈ క్రమంలో వికెట్లను తాకినా.. బెయిల్స్ పడకపోవడంతో హిట్ వికెట్ నుంచి తప్పించుకున్నాడు. 4పరుగులు
4వ బంతికి ఫోర్ : లెంత్ బాల్ వేయగా ఫైన్ లెగ్‌లో ఫోర్ బాదాడు. 4పరుగులు
5బంతికి సిక్స్ : మళ్లీ ఫైన్ లెగ్లో సిక్స్ కొట్టాడు. దీంతో 6పరుగులు.
6బంతికి సింగిల్ : డిఫెన్స్ చేసిన బుమ్రా సింగిల్ తీశాడు. 1పరుగు
అప్పటి ఎక్స్ ప్రెషన్ సేమ్ ఇప్పుడు కూడా
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బుమ్రా (16బంతుల్లో 31) విధ్వంసానికి బ్రాడ్ తలపట్టుకున్నాడు. అప్పట్లో యువీ బౌలింగ్లో ఆరు సిక్సులు ఇచ్చాక ఎలాంటి ఎక్స్ ప్రేషన్ పెట్టాడో సేమ్ అలాంటి ఎక్స్ ప్రేషన్ పెట్టడంతో అప్పటి పిక్, ఇప్పటి పిక్ నెట్టింటా వైరలవుతున్నాయి. నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పాపం స్టువర్ట్ బ్రాడ్ ఇండియా బ్యాటర్లను ఎంత ద్వేషిస్తాడో.. ప్రతిసారి నా బౌలింగే వీళ్లకు దొరుకుతుదని బ్రాండ్ అంటున్నట్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో బాదాలని యువీ.. బుమ్రా రూపంలో వచ్చి ఉంటాడని పేర్కొంటున్నారు. ఇక ఈ బుమ్రా (29) టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. అంతకుముందు బ్రియాన్ లారా (28)ను అతను దాటేశాడు.
వర్షం కారణంగా ఆగిన మ్యాచ్
ఇకపోతే ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (146పరుగులు 111బంతుల్లో), రవీంద్రా జడేజా (104పరుగులు 194బంతుల్లో 13ఫోర్లు ) సెంచరీలతో రాణించగా.. చివర్లో బుమ్రా విధ్వంసంతో స్కోరు బోర్డు 400దాటింది. ఇక 10వికెట్లు కోల్పోయి ఇండియా 416పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 21.5ఓవర్లలో 5 వికెట్లు తీసి ఫైఫర్ సాధించగా.. మాథ్యూ పాట్స్ 2, బెన్‌స్టోక్స్ , జో రూట్, బ్రాడ్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఇక బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 3ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 16పరుగులు చేసింది. అలెక్స్ లీస్ (6)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక క్రీజులో జాక్ క్రాలీ (7), ఆలీపోప్ (0) ఉన్నారు. వర్షం కారణంగా.. మ్యాచ్ తాత్కాలికంగా ఆగిపోయింది.


Click it and Unblock the Notifications












