Ind vs Eng 5th test : ఛేజింగ్లో ఇంగ్లాండ్ రికార్డుల జోరు.. ఇండియాపై అత్యధిక టార్గెట్ ఛేజ్ చేసిన జట్టుగా..!

రీషెడ్యూల్ చేసి అయిదో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విధించిన 378పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించి సిరీస్ సమం చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జానీ బెయిర్ స్టో నిలవగా..ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా జస్ప్రీత్ బుమ్రా, జో రూట్ నిలిచారు. ఇక నాలుగో రోజు నాటి ఓవర్ నైట్ స్కోరు 259పరుగులతో అయిదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఎప్పటిలాగే తన ఫియర్ లెస్ క్రికెట్‌తో గెలుపు ఒళ్లో వాలింది. మిగతా 119పరుగులను ఆడుతూ పాడుతూ రూట్, బెయిర్ స్టో బాదేశారు. ఫలితంగా 76.4ఓవర్లలో 3వవికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ 378పరుగుల టార్గెట్ ఛేదించి 7వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఫలితంగా ఈ సిరీస్ 2-2తో సమమైంది. ఈ క్రమంలో జానీ బెయిర్ స్టో (114పరుగులు 145బంతుల్లో 15ఫోర్లు, 1 సిక్సర్), జో రూట్ (142పరుగులు 173బంతుల్లో 19ఫోర్లు 1సిక్సర్) తమ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్.. టెస్టుల్లో అత్యధిక టార్గెట్ ఛేదించిన రికార్డును నెలకొల్పగా.. భారత్ తమ అత్యధిక పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయింది. తద్వారా భారత్ మీద అత్యధిక టార్గెట్ ఛేదించిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. ఇంగ్లాండ్ గడ్డమీద రెండో అత్యధిక చేజింగ్ ఇది. టెస్టు చరిత్రలోనే 8వ అత్యధిక టార్గెట్ ఛేజింగ్ ఇది. టెస్టు క్రికెట్లో ఒక జట్టు 250కంటే ఎక్కువ లక్ష్యాలను వరుసగా నాలుగు సార్లు సాధించిన రికార్డ్ కూడా ఇంగ్లాండ్ సొంతమైంది. మరికొన్ని రికార్డులను ఓసారి పరిశీలిస్తే..
* తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక ఆధిక్యాలు సాధించినప్పటికీ భారత్ ఓడిపోయిన సందర్భాలు
1. 2015లో శ్రీలంకతో గాలెలో జరిగిన టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగుల ఆధిక్యం సాధించినా ఓడిపోయింది.
2. 2022లో ఇంగ్లాండ్‌తో ఎడ్జ్ బాస్టన్ (రీషెడ్యూల్డ్ 5వ టెస్ట్) టెస్టోలో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 132 పరుగుల ఆధిక్యం సాధించినా.. 7వికెట్ల తేడాతో ఓడిపోయింది
3. 1992లో అడిలైడ్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగుల ఆధిక్యం సాధించినా ఓడింది.
4. 2008లో సిడ్నీలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 69పరుగుల ఆధిక్యం సాధించినా ఓటమిపాలయింది.
టెస్టుల్లో భారత్‌పై అత్యధిక టార్గెట్ ఛేదించిన సందర్భాలు
1. 2022లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన 5వ రీషెడ్యూల్డ్ టెస్టులో ఇండియా విధించిన 378పరుగుల టార్గెట్‌ను ఇంగ్లాండ్ సునాయసంగా ఛేదించింది. ఎంగ్ ఎడ్జ్‌బాస్టన్ 2022
2. 1977లో పెర్త్‌లో ఇండియా విధించిన 339పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించింది.
3. 1987లో ఢిల్లీలో ఇండియా విధించిన 276పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఛేదించింది.
4. 2022లో జోహన్నెస్ బర్గ్‌లో 240పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా ఛేదించింది.

అత్యధిక టార్గెట్‌ను ఇంగ్లాండ్ విజయవంతంగా ఛేదించిన సందర్భాలు
2022లో ఎడ్జ్ బాస్టన్‌లో భారత్ తో జరిగిన రీషెడ్యూల్డ్ 5వ టెస్టులో 378పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది.
2019లో లీడ్స్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 359పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
1928/29లో మెల్ బోర్న్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 339పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది.
2001లో లీడ్స్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 315పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications