వీడియో వైరల్: ఓవల్‌లో శిఖర్ ధావన్ భాంగ్రా స్టెప్పులు


హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటాడు. అంతేకాదు ధావన్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణంగా ఉంది. కుటుంబానికి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు జట్టులోని సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా మ్యాచ్ జరిగే సమయంలో ఓవల్ మైదానంలో ధావన్ భాంగ్రా స్టెప్పులు వేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఓవల్ వేదికగా ఐదో టెస్టు ప్రారంభం
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి ఓవల్ వేదికగా ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా టీమిండియా ఆడుతోన్న అన్ని మ్యాచ్‌లకు ‘భారత్ ఆర్మీ' హాజరై ఆటగాళ్లను ప్రోత్సహిస్తోన్న సంగతి తెలిసిందే.
చివరి టెస్టుకు భారత ఆర్మీ హాజరు
ఓవల్ వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య ప్రారంభమైన చివరి టెస్టుకు భారత ఆర్మీ హాజరైంది. తొలి రోజు మూడో సెషన్‌లో శిఖర్ ధావన్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తోన్న ‘భారత్ ఆర్మీ' డప్పులతో ధావన్‌కు ఊపుతెప్పించారు. దీంతో దీనికి అనుగుణంగా ధావన్ బాంగ్రా స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు.
మైదానంలో స్టెప్పులేసిన ధావన్
మైదానంలో ధావన్ స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధావన్ స్టెప్పులను చూసి కామెంటేటర్స్ సైతం నవ్వులు పూయిస్తూ రూమ్‌లో డ్యాన్సులు చేశారు. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న హర్భజన్ సింగ్ మరో కామెంటేటర్ డేవిడ్ లాయిడ్‌కి బాంగ్రా స్టెప్పులు ఎలా వేయాలో చూపించాడు.

తొలిరోజు భారత్‌దే
ఓవల్ వేదికగా శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో భారత బౌలర్లు అద్భు త ప్రదర్శన చేశారు. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న ఓపెనర్ అలిస్టర్ కుక్ (71), మొయిన్ అలీ (50) అర్ధ శతకాలతో రాణించగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్ (11 బ్యాటింగ్), రషీద్ (4 బ్యాటింగ్) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 1-3 తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications