టెస్టు అరంగేట్ర సమయం ఆసన్నమైంది: పాండ్యా స్థానంలో హనుమ విహారి?


హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్టు ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ఆరంభం కానుంది. దీంతో కనీసం చివరి టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆఖరి టెస్టులో స్వల్ప మార్పులతో బరిలోకి దిగనుంది.
చివరి టెస్టులో ఆల్ రౌండర్ పాండ్యా స్థానంలో యువ ఆటగాడు హనుమ విహారికి తుది జట్టులో చోటు కల్పించాలని అనుకుంటుండగా, మరోవైపు అశ్విన్‌ను తప్పించి జడేజాను తీసుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇప్పటికే ఇంగ్లాండ్ 3-1తో సిరీస్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ గడ్డపై భారత ఆటగాళ్ల ప్రదర్శనపై ఇప్పటికే పలువురు మాజీలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఓటమికి కోచ్ రవిశాస్త్రి బాధ్యత వహించాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే వ్యాఖ్యానించాడు. దీంతో కోహ్లీ సేన ఎలాగైన చివరి టెస్టులో విజయం సాధించాలని కసిగా ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో పలు మార్పులు చేసే అవకాశం ఉంది.

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మూడో టెస్టులో తప్పించి ఈ టెస్టు
సిరిస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో హార్దిక్ పాండ్యాను తప్పించి చివరి రెండు టెస్టుల కోసం ఎంపిక చేసిన యువ ఆటగాడు విహారికి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అదే గనుక జరిగితే ఓవల్ వేదికగా జరిగే చివరి టెస్టులో విహారి అరంగేట్రం చేసినట్లు అవుతుంది.

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు అనంతరం అశ్విన్ నాలుగో టెస్టులో
ఆడతాడా? లేదా? అన్న దానిపై తీవ్రచర్చ జరిగింది. ఈ సిరిస్‌కు ఎంపికైన జడేజాకు సైతం ఇప్పటివరకు ఒక్క టెస్టులో కూడా ఆడలేదు. మూడో టెస్టులో అశ్విన్ గాయపడినప్పటికీ, నాలుగో టెస్టులో అతడికి చోటు కల్పించారు. దీంతో నాలుగో టెస్టులో అశ్విన్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో అశ్విన్ బౌలింగ్ తీరుపై సర్వత్ర అనుమానాలు నెలకొన్నాయి. అశ్విన్ ఏదో అసంతృప్తితో ఉన్నాడని, అందుకే అతడు సరిగా బౌలింగ్ చేయలేదని పలువురు మాజీలు విమర్శించారు. దీంతో చివరి టెస్టులో అశ్విన్‌ను తప్పించి జడేజాను చోటు కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో పెద్దగా రాణించని కేఎల్
రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించి పృథ్వీషాను తుది జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు సూచించిన సంగత తెలిసిందే. దీంతో చివరి టెస్టులో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కదని.. అతని స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షా జట్టులోకి వస్తాడని అందరూ అంచనా వేశారు. అయితే, జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచన మరోలా ఉంది. కేఎల్ రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.

మొదటి రెండు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించని దినేశ్
కార్తీక్‌ను పక్కన పెట్టిన జట్టు మేనేజ్‌మెంట్ యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ప్రమోట్ చేసింది. రిషబ్ పంత్ సైతం ఆశించిన మేర రాణించలేదు. దీంతో అనుభవం ఉన్న ఆటగాడు దినేశ్ కార్తీక్ జట్టులో ఉండటం మేలని భావించి ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోవాలని అనుకుంటోందట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications