India Vs England, 5th Test: ఆధిక్యం 40, ఒకే ఒక్కడు జడేజా


హైదరాబాద్: చివరి టెస్టు మూడో రోజు టీమిండియా ఊహించినదానికన్నా మెరుగ్గా ఆడింది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న దశలో జడేజా (156 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 86 నాటౌట్), హనుమ విహారి (124 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) బాధ్యతాయుత ఇన్నింగ్స్ జట్టును ఆదుకున్నారు.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 95 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే లభించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కెరీర్‌లో చివరి టెస్టు ఇన్నింగ్స్ ఆడుతోన్న కుక్ (46 బ్యాటింగ్)తోపాటు కలిసి కెప్టెన్ రూట్ (29 బ్యాటింగ్) పరుగులతో క్రీజులో ఉన్నారు.
షమీ, జడేజా ఒక్కో వికెట్ తీశారు. 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది.

విహారి, జడేజా నిలకడైన ఆటతీరుతో
ఓవర్ నైట్ స్కోరు 174/6 పరుగులతో మూడో రోజు బరిలోకి దిగిన భారత్‌కు తొలి సెషన్‌లో విహారి, జడేజా నిలకడైన ఆటతీరుతో అండగా నిలిచారు. తొలి సెషన్‌లో వీరిద్దరు నెలకొల్పిన కీలక భాగస్వామ్యం ఇంగ్లండ్ ఆధిక్యాన్ని బాగా తగ్గించింది. ప్రారంభంలో స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ పదునైన బంతులను ఓపిగ్గా ఎదుర్కొన్న ఈ జోడీ, ఆ తర్వాత పరుగులు జోడించడంపై దృష్టి పెట్టారు.

తొలి గంటలో 33 పరుగులు
దీంతో తొలి గంటలో 33 పరుగులు వచ్చాయి. అలా 63వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. విహారి చక్కటి డిఫెన్సివ్ ఆటతో ఆకట్టుకోగా అటు జడేజా ఆటలో దూకుడు కనిపించింది. 62వ ఓవర్‌లో విహారి రెండు ఫోర్లు బాదగా ఆ తర్వాత జడ్డూ రెండు వరుస ఫోర్లతో జోరు పెంచాడు. అటు విహారి 104 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు.

హనుమ విహారిని ఔట్ చేసిన మొయిన్ అలీ
ఈ క్రమంలో మరో రెండు ఓవర్లలో లంచ్ విరామ సమాయనికి వెళ్లే ముందు హనుమ విహారిని మొయిన్ అలీ అవుట్ చేశాడు. కీపర్ క్యాచ్‌పై అతడు రివ్యూకు వెళ్లగా బ్యాట్.. బంతికి అదే సమయంలో ప్యాడ్‌కు తాకుతున్నట్టు కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడడంతో ఏడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

పరుగుల బాధ్యతను తీసుకున్న జడేజా
లంచ్ విరామ అనంతరం జడేజాతన అసలైన ఆటను ప్రదర్శించాడు. ఇషాంత్ శర్మ క్రీజులోకి వచ్చినప్పటికీ... పరుగుల బాధ్యతను పూర్తిగా జడేజా తీసుకున్నాడు. అవతలి బ్యాట్స్‌మెన్‌కు అవకాశమివ్వకుండా డబుల్స్, బౌండరీలు బాదాడు. 113 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

పదునైన బంతులతో బుమ్రాను బెదరగొట్టిన బ్రాడ్
88వ ఓవర్‌లో కొత్త బంతిని అందుకున్న స్టువర్ట్ బ్రాడ్ తన పదునైన బంతులతో బుమ్రాను అదరగొట్టాడు. అయితే మరుసటి ఓవర్‌లో జడేజా సిక్సర్ బాది ఎక్కువగా తనే స్ట్రయికింగ్‌కు వచ్చేలా చూసుకున్నాడు. అలాగే 95వ ఓవర్ చివరి బంతికి జడేజా లేని సింగిల్ కోసం ప్రయత్నించగా బుమ్రా రనౌట్ కావాల్సి వచ్చింది. దీంతో ఆఖరి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 40 పరుగులు
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అతిథ్య ఇంగ్లాండ్‌కు 40 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ రెండు వికెట్లను కోల్పోయింది. మ్యాచ్‌లో అద్భుత బంతులతో కట్టడి చేసిన షమీకి ఎట్టకేలకు జెన్నింగ్స్ రూపంలో తొలి వికెట్ లభించింది. ఆ తర్వాత అలీ, కుక్ కలిసి రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. ఆ తర్వాత రూట్‌తో కలిసి కుక్ మరో వికెట్ పడకుండా మూడో రోజుని ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications