Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

5th Test, Day 2: బట్లర్ హాఫ్ సెంచరీ, లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 304/8

India vs England 5th Test Day 2: England 304/8 At Lunch On Day 2 vs India

హైదరాబాద్: ఓవల్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ లంచ్ విరామ సమయానికి 115 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్ (63), స్టువర్ట్ బ్రాడ్(36) పరుగులతో ఉన్నారు.

ఓవర్ నైట్ స్కోరు 198/7తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. తొలి రోజు ఆటలో నాటౌట్‌గా నిలిచిన బట్లర్‌-రషీద్‌ రెండో రోజు ఆటను ప్రారంభించారు. రెండో రోజు రెండో ఓవర్లో ఇంగ్లాండ్‌ రెండు వందల పరుగుల మైలురాయిని అందుకుంది.

బుమ్రా వేసిన తొలి బంతిని రషీద్‌ ఫోర్‌గా మలచడంతో ఇంగ్లాండ్ రెండు వందల మార్కును దాటింది. అనతరం ఇన్నింగ్స్ 98వ ఓవర్లో బుమ్రా వేసిన తొలి బంతికి రషీద్‌ (15) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో భారత పేసర్లకు దక్కిన 59వ వికెట్‌ ఇది. ఒక సిరీస్‌లో భారత పేసర్లు అత్యధిక వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

1
42378

ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఇషాంత్‌ 18, మహమ్మద్‌ షమి 14, బుమ్రా 14, హార్దిక్‌ పాండ్య 10, ఇషాంత్‌ శర్మకు 3 వికెట్లు దక్కాయి. రషీద్‌ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన స్టువర్ట్ బ్రాడ్‌‌తో కలిసి ఆచి తూచి ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. ఈ క్రమంలో జోస్ బట్లర్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

ఇన్నింగ్స్ 109వ ఓవర్లో షమి వేసిన మూడో బంతికి రెండు పరుగులు చేసిన బట్లర్‌ అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో 10వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్ల సహానాన్ని పరీక్షిస్తున్నారు. దీంతో రెండో రోజు త్వరగా ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌ను ముగిద్దాం అనుకున్న భారత్‌కు నిరాశే మిగిలింది.

ఇప్పటికే ఈ వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కి 90కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Story first published: Saturday, September 8, 2018, 18:02 [IST]
Other articles published on Sep 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+