For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

135: కోహ్లీ కోసం 45 ఏళ్ల రికార్డు ఎదురు చూపు

ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో ఇప్పటికే సొంతం చేసుకున్న టీమిండియా చివరిదైన చెన్నై టెస్టులో కూడా అదేజోరు చూపి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతున్నది.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం 45ఏళ్ల రికార్డు ఎదురు చూస్తోంది. ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో ఇప్పటికే సొంతం చేసుకున్న టీమిండియా చివరిదైన చెన్నై టెస్టులో కూడా అదేజోరు చూపి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతున్నది. ఈ టెస్టులో గనుక టీమిండియా విజయం సాధిస్తే పలు రికార్డులు నమోదవుతాయి. చెన్నై టెస్టులో కోహ్లీ మరో 135 పరుగులు చేస్తే ఒక సిరిస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

గవాస్కర్ సాధించిన 774 పరుగులే అత్యధికం

గవాస్కర్ సాధించిన 774 పరుగులే అత్యధికం

1971లో కరేబియన్ దీవుల్లో వెస్టిండిస్ జట్టుపై తన అరంగేట్ర టెస్టు సిరిస్‌లో సునీల్ గవాస్కర్ సాధించిన 774 పరుగులే (4 మ్యాచ్‌లు, 8 ఇన్నింగ్స్) ఓ భారత క్రికెటర్ సాధించిన అత్యధిక స్కోరు. ఇప్పుడు ఆ రికార్డుని అధిగమించే అవకాశం టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడిన కోహ్లీ 640 పరుగులు చేశాడు.

135 పరుగుల అడుగు దూరంలో కోహ్లీ

135 పరుగుల అడుగు దూరంలో కోహ్లీ

దాంతో చెన్నై టెస్టులో మరో 135 పరుగులు సాధిస్తే ఒక సిరిస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుత కోహ్లీ ఫామ్‌ని చూస్తుంటే గవాస్కర్ రికార్డుని తేలికగా అధిగమించేలా ఉన్నాడు. మరోవైపు టీమిండియా స్ఫిన్నర్ అశ్విన్‌ మరో 9 వికెట్లు పడగొడితే ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలవనున్నాడు.

చరిత్ర సృష్టించనున్న టీమిండియా

చరిత్ర సృష్టించనున్న టీమిండియా

చెన్నై టెస్టులో భారత్ విజయం సాధిస్తే టెస్టు చరిత్రలో రెండోసారి ప్రత్యర్థిని 4-0తో ఓడించిన జట్టుగా కోహ్లి సేన నిలుస్తుంది. చివరిసారిగా అజారుద్దీన్ నాయకత్వంలో 1992-93లో ఇంగ్లాండ్‌పై 3-0తో విజయమే ఇప్పటివరకు భారత్‌కు అత్యుత్తమం. దీన్ని అధిగమించేందుకు కోహ్లీసేనకు ఇప్పుడు మంచి అవకాశం లభించింది.

18వ మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించిన కొత్త రికార్డు

18వ మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించిన కొత్త రికార్డు

మరోవైపు చెన్నై టెస్టు ‘డ్రా' అయినా మన జట్టు వరుసగా 18వ మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించిన కొత్త రికార్డు సొంతమవుతుంది. ఇదే గనుక జరిగితే, 84 ఏళ్లలో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన జట్టుగా కోహ్లీసేన పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.

ఆటగాళ్లు

ఆటగాళ్లు

774 - Gavaskar (Vs West Indies in 1971)

732 - Gavaskar (Vs West Indies in 1978-79)

692 - Kohli (Vs Australia in 2014-15)

642 - Dilip Sardesai (Vs West Indies in 1971)

640 (after 4 Tests) - Kohli (Vs England in 2016)

135: కోహ్లీ కోసం 45 ఏళ్ల రికార్డు ఎదురు చూపు

135: కోహ్లీ కోసం 45 ఏళ్ల రికార్డు ఎదురు చూపు

1st Test (Kingston): Did not play (Match drawn)

2nd Test (Debut) (Port of Spain): 65 and 67 not out (India won by 7 wickets)

3rd Test (Georgetown): 116 and 64 not out (Draw)

4th Test (Bridgetown): 1 and 117 not out (Draw)

5th Test (Port of Spain): 124 and 220 (Draw)

మొత్తం - 774 runs in 8 innings (4 100s, 3 50s, average - 154.80, highest score 220)

2016లో ఇంగ్లాండ్‌పై కోహ్లీ రాణించిన మ్యాచ్‌లో భారత్ 3-0తో సిరిస్ కైవసం చేసుకుంది

2016లో ఇంగ్లాండ్‌పై కోహ్లీ రాణించిన మ్యాచ్‌లో భారత్ 3-0తో సిరిస్ కైవసం చేసుకుంది

1st Test (Rajkot): 40 and 49 not out

2nd Test (Visakhapatnam): 167 and 81

3rd Test (Mohali): 62 and 6 not out

4th Test (Mumbai): 235 5th Test (Chennai): Yet to bat

మొత్తం - 640 runs in 7 innings (2 100s, 2 50s, average - 128, highest score 235)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+