For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Bumrah On Fire: బుల్లెట్టు బంతులు వేసేత్త ‌పా బూమ్ బూమ్ బూమ్ బూమ్ అని..! వాన వల్ల బతికిపోయారు..

India vs England 5th Test: Captain Jasprit Bumrah On Fire But The Rain extinguished it

ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియలో జరుగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. బూమ్ బూమ్‌లా నిప్పులు చెరుగుతున్నాడు. బ్యాటింగ్లో (16బంతుల్లో 31పరుగులు నాటౌట్) ఇచ్చి పడేసిన బుమ్రా.. బౌలింగ్లో కూడా బ్రిటిష్ టీం మీద తన బుల్లెట్ బంతులను ఎక్కు పెట్టి బౌలింగ్ వేస్తున్నాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా రాపిడ్ ఫైర్‌కు ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో నిలబడాలంటేనే వణికిపోతున్నారు. ఇక 6.3ఓవర్లకు 31పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ను రెయిన్ బతికిచ్చింది. బుమ్రా ఫ్లో కంటిన్యూ అయి ఉంటే.. ఇంక రెండు, మూడు వికెట్లు పుటపుట పడుతుండే.

బబ్లికం నములుడు కాకున్న ముందే..

బబ్లికం నములుడు కాకున్న ముందే..

ఇకపోతే బుమ్రా వేసిన మాస్టర్ క్లాస్‌ బౌలింగ్‌కు అలెక్స్ లీస్ (6పరుగులు 9బంతుల్లో) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాపం అతను నోట్లో వేసుకున్న బబ్లికం (బబుల్ గమ్) సగం కూడా నములుడు అయిందో లేదో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఇక కాసేపు వర్షం వల్ల అంతరాయం కలిగింది. దీంతో ముందుగానే లంచ్ సెషన్ ప్రకటించారు. మళ్లీ ప్లేయర్లు గ్రౌండ్లోకి రాగా.. బుమ్రా 5వ ఓవర్ తొలి బంతికి జాక్ క్రాలీ (9పరుగులు 17బంతుల్లో 1ఫోర్) కూడా తట్టాబుట్టా సర్దుకుని డగౌట్ బాట పట్టాడు. బుమ్రా బౌలింగ్లో స్లిప్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్ ఇచ్చిన క్రాలీ.. ఖాళీ చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయాడు. ఇక హ్యాట్రిక్ వికెట్ తీసే అవకాశం బుమ్రాకు వచ్చింది. కానీ రూట్ వచ్చి.. హ్యాట్రిక్ రూట్ ఇవ్వలేదు. ఇక మరోసారి వర్షం అందుకోవడంతో ఆట మళ్లీ ఆగిపోయింది

 తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్న రవీంద్రా జడేజా

తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్న రవీంద్రా జడేజా

ఇకపోతే రెండో రోజు 338/7 స్కోరుతో ఆట ప్రారంభించిన భారత జట్టు కాస్త దూకుడుగా ఆడింది. మహ్మద్ షమీ(16పరుగులు 31బంతుల్లో) వరుస బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డుకు ఊపొచ్చింది. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఇక రవీంద్ర జడేజా మాత్రం తన సూపర్బ్ బ్యాటింగ్‌తో సెంచరీ సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 83 పరుగులతో నాటౌట్‌గా ఉన్న రవీంద్ర జడేజా (104పరుగులు) చాలా క్రమశిక్షణగా ఆడుతూ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. బౌండరీతో సెంచరీకి చేరుకున్న జడ్డూ తన దైన స్టైల్లో బ్యాట్‌ను తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక తర్వాత చివర్లో బుమ్రా ఒకే ఓవర్లో 35పరుగులు పిండుకోవడంతో భారత్ స్కోరు 416పరుగులకు చేరుకుంది. అంతకుముందు రిషబ్ పంత్ తొలి రోజు అత్యధ్భుతంగా ఆడి (111బంతుల్లో 146పరుగులు) ఇండియాను కష్టాల్లో నుంచి గట్టెక్కించిన సంగతి తెలిసిందే. ఇక అతను 6వికెట్‌కు జడేజాతో కలిసి 222పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

తుది జట్లు :

తుది జట్లు :

భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్(కీపర్), జాక్ లీచ్, మ్యాటీ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Story first published: Saturday, July 2, 2022, 19:49 [IST]
Other articles published on Jul 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+