ఐదో టెస్టులోను తడబాటు: ఇంగ్లాండ్ 332 ఆలౌట్, భారత్ తొలి ఇన్నింగ్స్ 174/6

హైదరాబాద్: ఐదో టెస్టులో తొలి రోజు ఫర్వాలేదనిపించిన భారత్ శనివారం మాత్రం తేలిపోయింది. ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు చేర్చడంలో భారత బౌలర్లు విఫలం కావడం, మరోవైపు బ్యాట్స్‌మెన్ కూడా ఆకట్టుకోలేకపోయారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. పుజారా (37), రాహుల్ (37) ఫర్వాలేదనిపించారు.
క్రీజులో విహారి (25 బ్యాటింగ్), జడేజా (8 బ్యాటింగ్) ఉన్నారు. ఆండర్సన్, స్టోక్స్‌లకు రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 198/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్ (133 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 89), బ్రాడ్ (59 బంతుల్లో 3 ఫోర్లతో 38) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 122 ఓవర్లలో 332 పరుగుల వద్ద ముగించింది. జడేజాకు నాలుగు, బుమ్రా.. ఇషాంత్‌లకు మూడేసి వికెట్లు తీశారు.

జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ
ఓవర్ నైట్ స్కోరు 198/7తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌లో జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు స్కోరు 300కుపైగా పరుగులు దాటించడంలో సఫలమయ్యాడు. రషీద్ (15) ఔటైన తర్వాత బ్రాడ్‌తో కలిసి భారత బౌలర్లపై అతడు ఎదురుదాడికి దిగాడు. మ్యాచ్ ఆరంభమైన ఏడో ఓవర్‌లోనే రషీద్‌ను బుమ్రా ఎల్బీగా అవుట్ చేశాడు. దీంతో కొద్దిసేపట్లోనే మిగిలిన రెండు వికెట్లు పడతాయని ఆశించినా తొమ్మిదో వికెట్‌కు బట్లర్, బ్రాడ్ జోడీ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వేగంగా ఆడుతూ 61 బంతుల్లోనే 50 పరుగులు అందించడం భారత్‌ను మరింత ఆందోళనకు గురి చేసింది.

బ్రాడ్ వికెట్ తీసిన జడేజా
అటు బట్లర్ 84 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా జట్టు స్కోరు 114వఓవర్‌లో 300 దాటింది. లంచ్ విరామం తర్వాత మూడో ఓవర్‌లోనే బ్రాడ్ వికెట్‌ను జడేజా పడగొట్టాడు. దీంతో తొమ్మిదో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత 121వ ఓవర్‌లో వేగంగా ఆడే క్రమంలో బట్లర్ రెండు సిక్సర్లను బాదాడు. కానీ మరుసటి ఓవర్ ఆఖరి బంతికి అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు తెర పడింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ధావన్ మరోసారి విఫలం
పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న ధావన్ (3) బ్రాడ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో రిచర్డ్ హ్యాడ్లీ (431) వికెట్లను బ్రాడ్ అధిగమించాడు. కానీ మరో ఓపెనర్ రాహుల్ మాత్రం ఎటాకింగ్ ఆటతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్‌లో పుజారా తన శైలిలో ఇంగ్లండ్ పేసర్లను సులువుగానే ఎదుర్కోవడంతో ఈ సెషన్‌లో ఇద్దరి మధ్య 47 పరుగులు జత చేరాయి. 16వ ఓవర్‌లో పుజారా ఇచ్చిన క్యాచ్‌ను కుక్ అందుకోలేకపోయాడు. అలాగే భారత్ మరో వికెట్ పడకుండా టీ బ్రేక్‌కు వెళ్లింది.

టీ సమయానికి 53/1తో భారత్ మెరుగ్గానే
టీ సమయానికి 53/1తో భారత్ మెరుగ్గానే కనిపించింది. ఈ జంట కుదురుకుని ముందుకు సాగడంతో ఇంగ్లాండ్ బౌలర్లలోనూ అసహనం మొదలైంది. కానీ అద్భుతమైన బంతితో రాహుల్‌ను ఔట్ చేసిన కరన్.. ఈ జోడీని విడగొట్టాడు. ఇక కోహ్లీ, పుజారా మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడతారేమోనని ఆశించినా అదీ జరగలేదు. వీరి మధ్య 31 పరుగు లు జత చేరాక ఆండర్సన్ బౌలింగ్‌లో పుజారా (37) అవుటయ్యాడు. ఆ వెనుకే అండర్సన్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళుతున్న బంతిని వెంటాడిన పుజారా పెవిలియన్ చేరాడు.

రహానేను డకౌట్ చేసిన ఆండర్సన్
ఆ మరుసటి ఓవర్‌లోనే రహానేను ఆండర్సన్ డకౌట్ చేయడంతో భారత్ 103 రన్స్‌కు 4 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో విరాట్ కోహ్లి, విహారితో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. విహారి క్రీజులోకి వచ్చిన సమయంలో ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించాడు. దీనికి తోడు బ్రాడ్ అద్భుత బంతులతో వణికించాడు. అతడు వేసిన 36వ ఓవర్‌లో విహారి ఎల్బీ కోసం ఇంగ్లండ్ అప్పీల్ చేసినా అంపైర్ తోసిపుచ్చాడు. అయితే వీడియో రీప్లేలో ఇది అవుట్‌గా తేలినా వారు డీఆర్‌ఎస్‌కు వెళ్లకపోవడం లాభించింది. కానీ 38వ ఓవర్‌లో విహారి ఎల్బీ అయినట్టు అంపైర్ ప్రకటించినా రివ్యూకు వెళ్లి నాటౌట్‌గా బయటపడ్డాడు.

రెండో స్లిప్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ
ఇక 29 బంతుల్లో తొలి రెండు పరుగులు మాత్రమే చేసిన విహారి.. ఆ తర్వాత 45వ ఓవర్‌లో సిక్స్, ఫోర్‌తో స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. కర్రాన్ బౌలింగ్‌లోనూ రెండు ఫోర్లతో సత్తా చాటుకున్నాడు. అటు కోహ్లీ కూడా చెలరేగగా 18 బంతుల్లోనే 35 పరుగులు వచ్చాయి. అయితే స్టోక్స్ బౌలింగ్‌లో బంతిని డ్రైవ్ చేసే ప్రయత్నం చేసిన విరాట్ కోహ్లీ.. రెండో స్లిప్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. నాలుగో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రిషబ్ పంత్ (5) కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో భారత్ 174/6తో మరింత కష్టాల్లో పడింది. ఆ తర్వాత జడేజాతో కలిసి విహారి రోజును ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications