ఇంగ్లీషు గడ్డపై తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు

హైదరాబాద్: సౌతాంప్టన్ టెస్టులో 60 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలవ్వడంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే కోహ్లీసేన కోల్పోయింది. ఆదివారం ముగిసిన నాలుగో టెస్టులో టీమిండియా 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఆతిథ్య ఇంగ్లాండ్ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో కోహ్లీ-రహానేల జోడీ మాత్రమే 101 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా, మిగతా బ్యాట్స్‌మెన్ అంతా 83 పరుగులు చేయడం విశేషం. దీంతో మరో టెస్టు మిగిలిలుండగానే సిరీస్‌ను సమర్పించుకుంది.

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి
కాగా, ఇంగ్లాండ్‌పై ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి టీమిండియా ఓటమి పాలవడం ఇది మూడోసారి కావడం విశేషం. ఈ సిరీస్‌లో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 27 పరుగులు లభించగా, ఆపై రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
1936లో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో
అంతకుముందు 1936లో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 13 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించి భారత్ ఓటమి పాలు కాగా, ఆపై 2011లో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి కూడా పరాజయం చెందింది.

కెప్టెన్‌గా కోహ్లీ పలు రికార్డులు
ఆ తర్వాత ఇప్పుడు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక‍్యంలో నిలిచిన భారత్‌కు ఓటమి తప్పలేదు. నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా టెస్టుల్లో 4000 పరుగులు చేసిన తొలి కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 544 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ (496 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లీషు గడ్డపై ఓ టెస్టు సిరిస్‌లో 500కుపైగా పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాట్స్‌మన్ కోహ్లీనే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications