For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. నాలుగో టెస్టుకు మార్పులు చేయొద్దు: సెహ్వాగ్

India vs England, 4th Test: I dont want any changes in the playing XI in Southampton, says Virender Sehwag

నాటింగ్‌హామ్: ఇంగ్లాండ్‌తో పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే నాలుగో టెస్టుకు జట్టును ప్రకటించేసింది. మురళీ విజయ్.. కుల్దీప్ యాదవ్ స్థానాల్లో హనుమ విహారీ.. పృథ్వీ షాలను జట్టులోకి తీసుకుంది. కానీ, గురువారం నుంచి జరిగే నాలుగో టెస్టుకి భారత జట్టు మార్పులు లేకుండా బరిలోకి దిగితే మంచిదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచనలిస్తున్నాడు.

'నాలుగో టెస్టు కోసం తుది జట్టులో మార్పులు చేయొద్దని చెప్పడం చాలా కష్టమైన మాట. వ్యక్తిగతంగా జట్టు మార్పుని నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జట్టు మంచి సమతూకంతో కనిపిస్తోంది. పేసర్లు మంచి లయతో ఉన్నారు.. అలానే ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్‌ మూడో టెస్టులో మెరుగ్గా రాణించారు. ఫీల్డింగ్‌లో.. అదీ స్లిప్‌లో.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి అద్భుతంగా క్యాచ్‌లను అందుకున్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా వికెట్ల వెనుక తన ప్రతిభ చూపాడు. టెస్టుల్లో స్లిప్ క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాల్ని నిర్ణయిస్తాయి. మేము టెస్టులు ఆడే రోజుల్లో.. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ రూపంలో భారత్‌కి మంచి స్లిప్ ఫీల్డర్లు ఉన్నారు. వారు కష్టమైన క్యాచ్‌లను సైతం అలవోకగా ఒడిసిపట్టేవారు' అని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.

ఇటీవల నాటింగ్‌హామ్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా 203 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆ టెస్టులో జట్టు బాగా సమతూకంతో కనిపించిందని అభిప్రాయపడిన సెహ్వాగ్.. నాలుగో టెస్టులోనూ అదే జట్టుతో ఆడించాలని కోహ్లీకి సూచించాడు. మూడో టెస్టులో ఓపెనర్ మురళీ విజయ్, వికెట్ కీపర్‌ దినేశ్ కార్తీక్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై వేటు పడగా.. వారి స్థానంలో శిఖర్ ధావన్, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వచ్చారు.

1
42377

విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత్ జట్టు ఇప్పటి వరకు 38 టెస్టులు ఆడగా.. ప్రతి టెస్టులోనూ తుది జట్టులో కోహ్లీ మార్పులు చేస్తూ వస్తున్నాడు. కోహ్లీ జట్టు మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిస్తేనే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతుంది. లేదంటే రెండు సిరీస్‌లలోనూ పరాజయం మూటగట్టుకోవాల్సిందే.

Story first published: Sunday, August 26, 2018, 11:06 [IST]
Other articles published on Aug 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+