For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2006లో కూడా 400: సేమ్ సీన్ రీపీట్ అవుతుందా?

ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 400 పరుగులకు ఆలౌటైంది. 

By Nageshwara Rao

హైదరాబాద్: ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 400 పరుగులకు ఆలౌటైంది. అయితే యాదృచ్చికమో లేక కాకతాళీయమో తెలియదు గానీ సరిగ్గా పదేళ్ల క్రితం 2006లో ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా ఇంగ్లాండ్ 400 పరుగులకే ఆలౌట్ అయింది.

అప్పటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్ట్రాస్ 128 పరుగులతో సెంచరీ సాధించగా, గురువారం నాటి ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు కీనట్ జెన్నింగ్స్ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు ఆనాటి మ్యాచ్‌లో అప్పటి వరకు బ్యాటింగ్‌కు అనుకూలించని పిచ్ అనూహ్యంగా బౌలింగ్‌కు అనుకూలించింది.

దీంతో ఆ తర్వాత ధోని నేతృత్వంలోని టీమిండియా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 279 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో ధోని 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది.

313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా అత్యంత దారుణంగా కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేసిన 34 పరుగులే అత్యధికం కావడం విశేషం. దీంతో భారత్‌పైఇంగ్లాండ్ 212 పరుగులతో విజయం సాధించింది.

 India vs England 4th Test: England’s memorable wins at the Wankhede Stadium

ముంబై టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ డ్రాగా ముగిసింది. అయితే 2006లో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం కూడా ఉంది. వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుకి మంచి రికార్డు ఉంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తొలిరోజైన గురువారం జెన్నింగ్స్ (112) సెంచరీతో రాణించగా, మొయిన్ అలీ (50), కెప్టెన్ కుక్ (46) ఆకట్టుకున్నారు. రెండో రోజు జోస్ బట్లర్ (76) వన్డే తరహాలో అర్ధసెంచరీ సాధించాడు. బెన్ స్టోక్స్ (31), బాల్ (31) పరుగులు చేశారు.

ఇక మిగతా వారంతా డబుల్ డిజిట్ స్కోరు సాధించగా, కేవలం రషీద్ (4) మాత్రమే విఫలమయ్యాడు. బట్లర్ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 130.1 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 400 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా, జడేజా 4 వికెట్లు తీసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+