
అహ్మదాబాద్: మొతేరా వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో చివరిదైన నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం రూట్ రెండు మార్పులు చేశాడు. పేసర్లు జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్లను తప్పించి డాన్ లారెన్స్, డోమ్ బెస్లను జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక మార్పు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మొహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.
ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలని ఆశిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ ఇక్కడ గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని పరితపిస్తోంది. ఇక ఇదే వేదికపై జరిగిన పింక్‌బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగీయడంతో ఈ మ్యాచ్ ఎలా సాగుతుందనే విషయంపై ఆసక్తి కలుగుతోంది.
జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, చెతేశ్వ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషభ్‌పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్: డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జోరూట్ (కెప్టెన్), బెన్‌స్టోక్స్, ఓలిపోప్, బెన్‌ఫోక్స్, డానియల్ లారెన్స్, డొమినిక్ బెస్, జాక్‌లీచ్, జేమ్స్ అండర్సన్