
హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు లంచ్ విరామ సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా (28), విరాట్ కోహ్లీ (25) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 146 పరుగుల వెనుకంజలో ఉంది.
ఈ టెస్టు సిరిస్‌లో భారత ఓపెనర్లు తమ వైఫల్యాల బాటని కొనసాగిస్తున్నారు. గురువారం ఆరంభమైన నాలుగో టెస్టులో రెండో రోజైన శుక్రవారం 19/0తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా తొలి సెషన్‌లోనే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (19) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత మరో ఓపెనర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (23) బ్రాడ్ బౌలింగ్‌లోనే కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 50 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి భారత్ ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ... పుజారాతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు.
పుజారా(28) నిలకడగా ఆడుతూ కోహ్లీ (25)కి సహకారం అందిస్తున్నాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్‌కు మాత్రమే రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసింది.
ఇదిలా ఉంటే అతి తక్కువ ఇన్నింగ్స్(119)ల్లో 6వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(120 ఇన్నింగ్స్) రికార్డును బద్దలు కొట్టాడు.
ఇదిలా ఉంటే ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం నుంచి భారత ఓపెనర్లు ఫెయిలవుతున్నారు. తొలి టెస్టులో శిఖర్ ధావన్, మురళీ విజయ్ బరిలోకి దిగగా ఇద్దరూ నిరాశపరిచారు. ఆ తర్వాత రెండో టెస్టులో మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
మళ్లీ అదే ఫలితం. ఇక మూడో టెస్టులో ధావన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లు బరిలోకి దిగినప్పటికీ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. తాజాగా నాలుగో టెస్టులోనూ వీరిద్దరూ నిరాశపరిచారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు భారత ఓపెనర్లు కనీసం హాఫ్ సెంచరీని కూడా నమోదు చేయలేకపోయారు.