4th Test, Day 2: భారత్ 273 ఆలౌట్, ఆధిక్యం 27 పరుగులు


హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో పుజారా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు సెంచరీతో జట్టుని ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకి ఆలౌటైంది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 27 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 19/0తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పుజారా (132 నాటౌట్: 257 బంతుల్లో 16 ఫోర్లు) అజేయ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (46: 71 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

టెయిలెండర్లతో కలిసి జట్టుని మెరుగైన స్థితిలో
చివర్లో టెయిలెండర్లతో కలిసి జట్టుని మెరుగైన స్థితిలో నిలిపాడు. తొలిరోజు ఇంగ్లాండ్ 246 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో భారత్ జట్టుకి 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత్ ఆలౌట్ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6/0తో నిలిచింది.

క్రీజులో అలిస్టర్ కుక్ (2), జెన్నింగ్స్ (4)
క్రీజులో ఓపెనర్లు అలిస్టర్ కుక్ (2), జెన్నింగ్స్ (4) పరుగులతో ఉన్నారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ధావన్ (23), రాహుల్ (19) వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లను బ్రాడ్ పడగొట్టాడు. ఈ స్థితిలో కెప్టెన్ కోహ్లీ, పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.

142 పరుగుల వద్ద కోహ్లీ ఔట్
కానీ.. జట్టు స్కోరు 142 వద్ద కోహ్లీ ఔటయ్యాడు. ఆ తర్వాత భారత వికెట్లు క్రమం తప్పకుండా పడిపోయాయి. అనంతరం వచ్చిన రహానే (11), రిషబ్ పంత్ (0), హార్దిక్ పాండ్యా (4), అశ్విన్ (1) పేలవరీతిలో వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు. రిషబ్ పంత్ 29 బంతులాడి ఒక్క పరుగూ చేయకపోవడం గమనార్హం.

53 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు
ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ(5/63) విజృంభించడంతో భారత్ 53 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు చేజార్చుకుని 195/8తో పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో భారత్ 200లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివర్లో ఇషాంత్ శర్మ (14), జస్‌ప్రీత్ బుమ్రా (6)తో కలిసి పుజారా దూకుడుగా ఆడాడు.

ఇషాంత్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 32 పరుగులు
ఇషాంత్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 32 పరుగులు జత చేసిన పుజారా.. బుమ్రా తోడుగా ఆఖరి వికెట్‌కు విలువైన 46 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే పుజారా 210 బంతుల్లో కెరీర్‌లో 15వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత పుజారా స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. చివర్లో బుమ్రాను బ్రాడ్ ఔట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications