For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvENG, Day1: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు

India vs England, 4th Test, Day 1: Live Updates: Joe Root wins toss, opts to bat first

సౌతాంప్టన్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో ఆడుతోన్న టీమిండియా నాలుగో టెస్టుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన జోయ్ రూట్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా.. తొలి రెండు టెస్టుల్లోనూ భారత్ జట్టు పేలవరీతిలో ఓడిపోయింది. మూడో టెస్టులో అనూహ్యంగా పుంజుకుని గెలిచిన టీమిండియా.. నాలుగో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ని 2-2తో సమం చేయాలని ఆశిస్తోంది.

1
42377

'భారత జట్టులో ప్రస్తుతం అందరూ ఫిట్‌గా ఉన్నారు. గాయపడిన అశ్విన్‌.. పూర్తిగా కోలుకున్నాడు. అతను ప్రాక్టీస్ సెషన్‌లోనూ చురుగ్గా కనిపించాడు. తుది జట్టులో తరచూ మార్పులు చేయాలని నేను ఆశించను. కానీ.. గాయాల కారణంగా ఇప్పటి వరకు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. మూడో టెస్టులో జట్టు సమతూకంగా కనిపించింది. కాబట్టి.. నాలుగో టెస్టుకి జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు' అని కోహ్లీ వెల్లడించాడు.

మురళీ విజయ్.. స్థానంలో పృథ్వీ షా మరొకరి స్థానంలో హనుమవిహారీని ఎంచుకున్న టీమిండియా-ఇంగ్లాండ్‌ల మధ్య గురువారం మధ్యాహ్నం 3:30గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

భారత్ జట్టు:
Shikhar Dhawan, Lokesh Rahul, Cheteshwar Pujara, Virat Kohli(c), Ajinkya Rahane, Hardik Pandya, Rishabh Pant(w), Ravichandran Ashwin, Ishant Sharma, Mohammed Shami, Jasprit Bumrah.

ఇంగ్లాండ్ జట్టు:
Alastair Cook, Keaton Jennings, Joe Root(c), Jonny Bairstow, Ben Stokes, Jos Buttler(w), Moeen Ali, Sam Curran, Adil Rashid, Stuart Broad, James Anderson.

Story first published: Thursday, August 30, 2018, 15:49 [IST]
Other articles published on Aug 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+