మరో మైలురాయి: 14వ క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర
ముంబై: ఇంగ్లాండ్‌తో ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న నాలుగో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకోనున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇప్పటికే ఇంగ్లాండ్‌పై 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 8(గురువారం) నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇదే ఫామ్‌ని కొనసాగించి నాలుగో టెస్టులో కోహ్లీ 41 పరుగులు చేస్తే టెస్టుల్లో 4,000 పరుగులను పూర్తి చేసుకుంటాడు.

ఇంగ్లాండ్ సిరిస్‌లో ఇప్పటివరకు 405 పరుగులు
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరిస్‌లో ఇప్పటి వరకు 405 పరుగులు సాధించిన కోహ్లీ తన క్రికెట్ కెరీర్‌లో మరో మైలురాయిని ముంబై టెస్టులో అందుకోనున్నాడు. తద్వారా 4,000 పరుగులు మైలురాయిని అందుకున్న 14వ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.

15,291 పరుగులతో సచిన్ మొదటి స్ధానంలో
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15,291 పరుగులతో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో నెంబర్ వన్ స్ధానంలో ఉన్నాడు. 2011లో వెస్టిండిస్‌పై అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ అటు టెస్టులతో పాటు ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు.

48.28 యావరేజితో 3,959 పరుగులు
తన క్రికెట్ కెరీర్‌లో 51 టెస్టు మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 48.28 యావరేజితో 3,959 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి.

సచిన్ టెండూల్కర్
భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
15,921 - సచిన్ టెండూల్కర్ (200 matches)
13,288 - రాహుల్ ద్రవిడ్ (164)
10,122 - సునీల్ గవాస్కర్ (125)
8,781 - వీవీఎస్ లక్ష్మణ్ (134)
8,586 - వీరేంద్ర సెహ్వాగ్ (104)
7,212 - సౌరభ్ గంగూలీ (113)
6,868 - దిలిప్ వెంగ్ సర్కార్ (116)
6,215 - అజారుద్దీన్ (99)
6,080 - జీఅర్ విశ్వనాథ్ (91)
5,248 - కపిల్ దేవ్ (131)
4,876 - మహేంద్ర సింగ్ ధోని (90)
4,378 - మొహిందర్ అమర్నాధ్ (69)
4,154 - గౌతం గంభీర్ (58)
3,959 - విరాట్ కోహ్లీ (51)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications