
రాహుల్‌ను కొనసాగిస్తారా?:
సిరీస్‌లో వరుసగా 1,0,0 స్కోర్లతో తీవ్రంగా విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తుది జట్టులో కొనసాగిస్తారా అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సైతం రోహిత్ శర్మతో కలిసి రాహులే ఓపెనింగ్‌కు దిగుతాడన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో రాహుల్‌కు మరో అవకాశం దక్కవచ్చు. అరంగేట్ర మ్యాచ్‌లో బ్యాటింగ్ కూడా రాకుండా గత పోరులో పక్కన పెట్టిన సూర్యకుమార్ యాదవ్‌ను రాహుల్ స్థానంలో తీసుకొని.. ఇషాన్ కిషన్‌తోనే ఓపెనింగ్ చేయించాలనే ప్రత్యామ్నాయం భారత్ ముందుంది. మరి కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

దీపక్ చహర్ ఆడేనా:
విరాట్ కోహ్లీ వరుస అర్ధ శతకాలతో మంచి ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. రోహిత్ శర్మ కూడా చెలరేగితే తిరుగుండదు. ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. హార్దిక్ పాండ్యా కూడా లయ అందుకుంటే జట్టు విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇక గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్లు మార్క్‌వుడ్, ఆర్చర్ చెలరేగిన పిచ్‌పై.. మన ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. భువీ ఫర్వాలేదనిపించినా.. శార్దూల్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో నాలుగో టీ20 కోసం అతని స్థానంలో దీపక్ చాహర్‌ను తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.

మరో ఆల్‌రౌండర్:
ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతని బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అలవోకగా భారీషాట్లు ఆడుతున్నారు. వైవిధ్యం ప్రదర్శించలేకపోతున్న చహల్.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో జట్టులోకి మరో ఆల్‌రౌండర్ అవసరం ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ భావిస్తున్న నేపథ్యంలో అతని స్థానంలో అక్షర్ పటేల్ లేదా రాహుల్ తెవాటియాకు చోటు దక్కే అవకాశం ఉంది. ఇద్దరిలో ఎవరు ఆడినా.. బ్యాటింగ్ బలం కూడా పెరగనుంది.

వుడ్ బౌలింగ్‌తో సమస్యే:
గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ బ్యాటింగ్ పదును చూపించింది. రాయ్, మలాన్ విఫలమైనా.. బట్లర్, బెయిర్‌స్టో ప్రదర్శించిన దూకుడుతో జట్టుకు సునాయాస విజయం దక్కింది. ఐపీఎల్ అనుభవం వారికి అదనపు బలంగా మారింది. మోర్గాన్, స్టోక్స్ కూడా ధాటిగా ఆడగల సమర్థులు కాబట్టి వారిని నిలువరించడం భారత్‌కు అంత సులువు కాదు. ఇక మార్క్ వుడ్ తన ఫాస్ట్ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ తీస్తున్నాడు. ఆర్చర్ కూడా అతనికి సహకారం అందించాడు. వీరిద్దరు మరోసారి చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవు.

జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్/ రాహుల్ తెవాటియా, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్/దీపక్ చహర్, వాషింగ్టన్ సుందర్.
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ ఉడ్.


Click it and Unblock the Notifications
