For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Vs England, 3వ టెస్టు: భారత్ బ్యాటింగ్, పంత్ అరంగేట్రం

By Nageshwara Rao
India V/S England 3rd Test: England Won The Toss & chooses To Bowl
India Vs England, 3rd Test: England won the toss and opted to field first

లండన్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలని భావించామని, టాస్ ఓడినా అదే దక్కిందని పేర్కొన్నాడు. పిచ్‌పై పచ్చిక బాగుందన్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో బుమ్రా, మురళీ విజయ్ స్థానంలో ధవన్, దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ బంతితో మరోమారు అద్భుతాలు చేస్తామన్నాడు. త్వరగా వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచుతామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ టెస్టును గెలవడం ద్వారా చరిత్ర సృష్టిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. రెండింటిలోనూ ఇంగ్లాండ్ విజయం సాధించి 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన కోహ్లీసేన కనీసం ఈ టెస్టు‌తోనైనా సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది.

భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు మార్పులు చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాని జట్టులోకి తీసుకున్నాడు. యువ వికెట్‌ కీపర్ రిషబ్ పంత్‌కి కెరీర్‌లో ఇదే తొలి టెస్టు మ్యాచ్.

1
42376

భారత్ జట్టు: శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా

ఇంగ్లాండ్ జట్టు: అలిస్టర్ కుక్, జెన్నింగ్స్, జో రూట్ (కెప్టెన్), పోప్, జానీ బాయిర్‌స్టో (వికెట్ కీపర్), జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్, క్రిస్‌వోక్స్, అదిల్ రషీద్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Story first published: Saturday, August 18, 2018, 15:51 [IST]
Other articles published on Aug 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+