మొహాలి: ఇంగ్లాండ్‌తో మొహాలి వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 103 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది.
ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్‌గా వెనుదిరిగినా, పుజారా (25), విరాట్‌కోహ్లీ (6 నాటౌట్)లతో చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పార్ధీవ్ పటేల్ భారత్‌కు విజయాన్ని అందించాడు. మూడో టెస్టులో పార్ధీవ్ పటేల్ విన్నింగ్ షాట్ కోట్టాడు. భారత స్పిన్నర్లు సత్తా చాటడంతో నాలుగు రోజుల్లోనే మొహాలి టెస్టు ముగిసింది.
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్
ఇంగ్లాండ్: 283 ఆలౌట్
భారత్: 417 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్
ఇంగ్లాండ్: 283 36ఆలౌట్
భారత్: 104/2
మ్యాచ్ ఫలితం: ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
12 ఏళ్ల తర్వాత పార్థివ్ అర్ధసెంచరీ
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ అర్ధసెంచరీని నమోదు చేశాడు. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న పార్ధీవ్ పటేల్ 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అంతేకాదు భారత జట్టు తరుపున టెస్టుల్లో సుదీర్ఘ విరామం తర్వాత అర్ధ సెంచరీ చేసింది కూడా పార్ధీవ్ పటేలే కావడం విశేషం. 12 ఏళ్ల 43 రోజుల కిత్రం పార్ధీవ్ అర్ధ సెంచరీ సాధించాడు.

టీ విరామానికి భారత్ 33/1
103 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 8 బంతులాడిని ఓపెనర్ మురళీ విజయ్ వోక్స్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 6 ఓవర్లకు గాను టీమిండియా ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం పార్ధీవ్ పటేల్ 16, పుజారా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 70 పరుగులు చేయాల్సి ఉంది.
భారత్ విజయలక్ష్యం 103
ఇంగ్లాండ్‌తో మొహాలిలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా గెలుపు ముంగిట నిలిచింది. 78/4పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 236 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు 103 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
మంగళవారం ఆటలో భాగంగా జో రూట్(78), హమిద్(59 నాటౌట్), వోక్స్(30) పరుగులతో రాణించారు. హమీద్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే జో రూట్ ప్రయత్నించినా ఏడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరి జోడీ 43 పరుగులు జోడించిన తర్వాత వోక్స్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రషిద్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జేమ్స్ అండర్సన్(5) రనౌట్ కావడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసుకోగా, షమీ, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌లకు తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 283 పరుగుల చేయగా, టీమిండియా 417 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 156/7
మొహాలి వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ లంచ్ విరామానికి 7 వికెట్లను కోల్పోయి 156 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హామీద్ 13, వోక్స్ ఒక పరుగుతో ఉన్నారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ భారత్‌పై 22 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
మొహాలి టెస్టులో ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 152 పరుగుల వద్ద జో రూట్‌ని జడేజా పెవిలియన్‌కు పంపాడు. 179 బంతులను ఎదుర్కొన్న జో రూట్ 6 ఫోర్లతో 78 పరుగులు సాధించాడు. దీంతో 70 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 7 వికెట్లను కోల్పోయి 156 పరుగులు సాధించింది. 78/4 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మంగళవారం ఆటలో భాగంగా ఈ క్రమంలో జో రూట్ నిలకడా రాణిస్తూ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం హామీద్ 13, క్రిస్ వోక్స్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇంగ్లాండ్‌తో మొహాలి వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ సేన గెలుపు దిశగా పయనిస్తోంది. ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులకు 6 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఇంగ్లాండ్... భారత్‌పై 3 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
ఫోటోలు: భారత్ Vs ఇంగ్లాండ్ టెస్టు సిరిస్
అయితే ఇంగ్లాండ్ చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నాలుగు వికెట్లను పడగొడితే భారత్ స్వల్ప విజయాన్ని చేధించాల్సి ఉంటుంది. ఇంకా బుధవారం కూడా ఆట మిగిలి ఉండటంతో మూడో టెస్టులో ఫలితం వచ్చేలా కనిపిస్తోంది. అంతేకాదు ఈ టెస్టులో భారత్ విజయం స్పష్టంగా తెలుస్తోంది.

భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ఆరంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 78/4తో మంగళవారం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. రూట్ (36), బ్యాటీ (0) బ్యాటింగ్‌కు దిగారు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్ లోనే ఆల్ రౌండర్ జడేజా బ్యాటీని ఔట్ చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బట్లర్‌ను 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జయంత్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లాండ్ 283, భారత్ 417 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.