India vs England, 3rd Test: విజయానికి వికెట్ దూరంలో నిలిచిన భారత్


లండన్: నాటింగ్‌హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీసేన గెలుపు అంచుల్లో నిలిచింది. ఇంకొక్క వికెట్ తీస్తే విజయం భారత్‌దే. అదే ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ గెలవాలంటే మాత్రం 210 పరుగులు చేయాలి. దీంతో చివరిరోజు టీమిండియా విజయం లాంఛనమే కావచ్చు.
521 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి 311/9తో నిలిచింది. ఏకపక్షంగా సాగిన మూడో టెస్టు నాలుగో రోజు తొలి సెషన్‌లో ఆతిథ్య జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చిన భారత బౌలర్లు రెండో సెషన్‌లో మాత్రం కాస్త నిరాశపరిచారు.
అయితే, చివరి సెషన్‌లో బుమ్రా (5/85) మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చాడు. కానీ రషీద్ (30 బ్యాటింగ్) ఒంటరి పోరాటంతో ఐదో రోజు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంగ్లాండ్‌ను జోస్ బట్లర్ (106), బెన్ స్టోక్స్ (62) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. ప్రస్తుతం క్రీజులో రషీద్ (30), అండర్సన్ (8) పరుగులతో ఉన్నారు.
జస్ప్రీత్ బుమ్రా (5/85) కెరీర్ నాలుగో టెస్టులోనే రెండో సారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఈ ఇన్నింగ్స్‌లో లోకేశ్ రాహుల్ నాలుగు క్యాచ్‌లు పట్టడం విశేషం.

ఓవర్‌నైట్ స్కోరు 23/0తో నాలుగో రోజు ఆట
నాలుగో రోజు ఉదయం ఆట ఆరంభమైన తీరు చూస్తే.. మ్యాచ్ సాయంత్రం దాకా కూడా కొనసాగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. మబ్బులు కమ్మి ఫాస్ట్‌బౌలర్లకు అత్యంత అనుకూలంగా కనిపించిన వాతావరణంలో భారత పేసర్లు చెలరేగారు. ఓవర్‌నైట్ స్కోరు 23/0తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఐదు పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. మంగళవారం మొదటి ఓవర్లోనే జెన్నింగ్స్‌ను (13) ఔట్ చేసిన ఇషాంత్, తన తర్వాతి ఓవర్లో మరో చక్కటి బంతితో కుక్ (17)ను పెవిలియన్‌కు పంపించాడు.

కోహ్లీ అద్భుత క్యాచ్
జట్టును ఆదుకోవడంలో కెప్టెన్ రూట్ (13), ఒలివర్ పోప్ (16) విఫలమయ్యారు. ఐదు బంతుల తేడాలో ముందుగా రూట్‌ను బుమ్రా ఔట్ చేయగా, షమీ బౌలింగ్‌లో మూడో స్లిప్‌లో కోహ్లీ అద్భుత క్యాచ్‌కు పోప్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ వెంటనే వ్యక్తిగత స్కోరు 1 వద్ద బుమ్రా బౌలింగ్‌లో బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ వదిలేయడంతో దానిని సద్వినియోగం చేసుకుని సెంచరీతో చెలరేగాడు. తొలి సెషన్‌లో దాదాపు 10 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకున్న స్టోక్స్, బట్లర్ లంచ్ విరామం తర్వాత కూడా అదే పట్టుదలతో ఆడారు.

అశ్విన్‌కి నడుం నొప్పి
భారత పేసర్లు చక్కగా బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం దక్కలేదు. నడుం నొప్పితో అశ్విన్, కారణం లేకుండా షమీ కాస్త అలస్యంగా మైదానంలోకి వచ్చారు. దీంతో తమ బౌలింగ్‌తో సెషన్‌ను పార్రంభించిన బుమ్రా, పాండ్యా ఇంగ్లిష్ ద్వయంపై ఒత్తిడి పెంచలేకపోయారు. అయితే అశ్విన్ వచ్చాకా.. స్టోక్స్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. 55వ ఓవర్‌లో ఆఫ్ స్పిన్నర్ వేసిన గూగ్లీకి స్టోక్స్ ఎల్బీ అయ్యాడు. కానీ రివ్యూలో బతికిపోయాడు. మరోవైపు 93 బంతుల్లో బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఇంగ్లండ్ రెండో సెషన్‌ను విజయవంతంగా ముగించింది.
కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన జోస్ బట్లర్
57వ ఓవర్‌లో షమీ వేసిన బంతికి బట్లర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ తిరస్కరించినా.. కోహ్లీ రివ్యూకు వెళ్లాడు. కానీ బంతి లెగ్‌సైడ్ బయటకు వెళ్లడంతో భారత్ ప్రయత్నం విఫలమైంది. టీ విరామం తర్వాత కూడా వీరిద్దరూ తమ జోరు కొనసాగిస్తూ మరింత స్వేచ్ఛగా ఆడారు. షమీ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన బట్లర్... ఈ క్రమంలో 152 బంతుల్లోనే కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడీని 83వ ఓవర్‌లో బుమ్రా విడగొట్టాడు.
సూపర్ బంతికి బట్లర్ ఔట్
అతడి బంతిని ఆడకుండా బట్లర్ చేతులెత్తేయగా అది నేరుగా ప్యాడ్లను తాకింది. అంపైర్ ఔట్‌గా ప్రకటించినా బట్లర్ రివ్యూ కోరాడు. అయితే లాభం లేకపోయింది. దీంతో బట్లర్, స్టోక్స్ ఐదో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. అద్భుతంగా వేసిన తర్వాతి బంతితో బెయిర్‌స్టో (0)ను క్లీన్‌బౌల్డ్ చేసిన బుమ్రా... తర్వాతి ఓవర్లోనే వోక్స్ (4)ను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రషీద్‌ను కూడా బుమ్రా ఔట్ చేసినా అది ‘నోబాల్'గా తేలింది. ఈ దశలో దూకుడుగా ఆడిన రషీద్, బ్రాడ్ జోడీ తొమ్మిదో వికెట్‌కు 50 పరుగులు జోడించింది. ఎట్టకేలకు 97వ ఓవర్‌లో బ్రాడ్‌ను ఔట్ చేసినప్పటికీ, భారత్ విజయానికి ఆండర్సన్ రూపంలో మరో వికెట్ మిగిలి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications