For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో టెస్టులో ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ: కీపర్‌కు గాయం

By Nageshwara Rao
India V/S England 3rd Test: Jonny Bairstow Was Taken To The Hospital During The Match | Oneindia
India vs England, 3rd Test Day 3 at Trent Bridge: Jonny Bairstow sustains fractured finger

లండన్: నాటింగ్‌హామ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో తీవ్రంగా గాయపడ్డాడు. ఓవర్‌ నైట్ స్కోరు 124/2తో మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత జేమ్స్ ఆండర్సన్ ఓవర్‌లో బెయిర్‌స్టో ఎడమ చేతి వేలికి గాయమైంది.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జట్టు మేనేజ్‌మెంట్ అతడిని వెంటనే మైదానం నుంచి పంపించి వేసింది. అనంతరం అతడి స్థానంలో జోస్ బట్లర్ వికెట్‌ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాడు. గాయపడ్డ బెయిర్‌స్టోకి ప్రస్తుతం నాటింగ్‌హామ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతనికి ఎక్స్‌రే తీస్తున్నారని, దీని ఫలితాన్ని బట్టి అతను తదుపరి మ్యాచ్‌లో కొనసాగించాలా లేదా అన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

1
42376

ఇదిలా ఉంటే, మూడో రోజైన సోమవారం ఓవర్‌ నైట్ స్కోరు 124/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టు.. లంచ్ విరామ సమయానికి 60 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (56 బ్యాటింగ్), పుజారా (54 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఇంగ్లాండ్‌పై 362 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు నడిపించారు. పదేపదే ఇంగ్లండ్‌ సారథి జోయ్‌ రూట్‌ బౌలింగ్‌ మారుస్తూ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కొంది.

Story first published: Monday, August 20, 2018, 19:11 [IST]
Other articles published on Aug 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+